World Bank: పాకిస్థాన్ పేద దేశంగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదే

World Bank: ప్ర‌పంచంలో అత్య‌ధిక పేద దేశం ఏద‌న్నా ఉందంటే అది పాకిస్థాన్. ఇందుకు కార‌ణం ఏంటో కూడా ప్ర‌పంచ బ్యాంకు తెలియ‌జేసింది. పాక్ పేద దేశంగా మార‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే.. జ‌న‌ర‌ల్ సేల్స్ ట్యాక్స్ (GST). పాక్‌లోని పేద కుటుంబాలు త‌మ ప్రీ ట్యాక్స్ ఆదాయం నుంచే 7 శాతం GST చెల్లిస్తున్నారు.

దాంతో వారికి తిన‌డానికి, దాచుకోవ‌డానికి ఏమీ మిగ‌ల‌కుండా పోతోంది. ఈ GST వ‌ల్లే స‌గానికి పైగా పాకిస్థాన్ కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. నెల నెలా ప్ర‌భుత్వం ఇలాంటి కుటుంబాల‌కు నేరుగా ఆర్థిక సాయం చేస్తే ప‌రిస్థితి కాస్త చెక్క‌బ‌డే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌పంచ బ్యాంకు స‌ల‌హా ఇచ్చింది. అంతేకాదు.. ప్రాథ‌మిక విద్య‌ను కూడా ప్ర‌భుత్వం ఉచితంగా ఇస్తే పేద పిల్ల‌లకు చ‌దువుకునే అవ‌కాశం ఉంటుంద‌ని.. త‌ద్వారా వారు ఉద్యోగాలు తెచ్చుకోగ‌లుగుతార‌ని తెలిపింది. కానీ పాక్‌కి ఇవేమీ ప‌ట్ట‌వు. ఎంత సేపూ భార‌త్‌ను ఎలా దెబ్బ‌కొడ‌దామా.. ఇందుకోసం ఉగ్ర‌వాదుల‌కు మెరుగైన ట్రైనింగ్ ఎలా ఇవ్వాలా అనే ఆలోచ‌న‌ల్లో మాత్ర‌మే కూరుకుపోయింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *