Search The Query
Search

Image
  • Home
  • Health
  • కూర్చున్నా సిగ‌రెట్ తాగినా ఒక్క‌టే

కూర్చున్నా సిగ‌రెట్ తాగినా ఒక్క‌టే

0Shares

Sitting for too long పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి ఎంత హానిక‌ర‌మో.. ఎక్కువ సేపు కూర్చున్నా కూడా అంతే హాని అని వైద్యులు ప‌దే ప‌దే హెచ్చ‌రిస్తున్నారు.

గంట‌ల త‌ర‌బ‌డి.. అంటే రెండు గంట‌ల పాటు క‌ద‌ల‌కుండా కూర్చున్నా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ముంద‌స్తు మ‌ర‌ణాలు సంభ‌వించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెప్తున్నారు.

మ‌నిషి శ‌రీరం రోజంతా అటూ ఇటూ తిరుగుతూ.. క‌దులుతూ ఉండేలా త‌యారుచేయ‌బ‌డింద‌ట‌. ఎక్కువ సేపు కూర్చోవ‌డం వ‌ల్ల మెట‌బాలిజం ప‌డిపోతుంది.. పిర్ర‌ల భాగంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఆగిపోయి అవ‌య‌వాల చుట్టూ కొవ్వు చేరుతుంది.

ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప‌డిపోతుంది. ఫ‌లితంగా గుండెపోటు, డ‌యాబెటిస్ టైప్ 2 వంటివి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్తున్నారు.

నేను రోజూ గంట పాటు వ్యాయామం చేస్తాను.. ఎక్కువ సేపు కూర్చున్నా ఏం కాదు.. అనుకుంటే పొర‌పాటే అంటున్నారు. ఎందుకంటే ఒక గంట వ్యాయామం 7 నుంచి 8 గంట‌ల పాటు కూర్చోవ‌డాన్ని స‌రిచేసేయ‌లేదు.

ఇలాంటి వాళ్ల‌లోనే 50ల్లో రావాల్సిన రోగాలు 30 ఏళ్ల‌కే క‌నిపిస్తున్నాయ‌ని వైద్యులు ఆందోళ‌న చెందుతున్నారు. ఇలా ఎక్కువ సేపు కూర్చోవ‌డం కూడా ఒక రోగ‌మే. ఆ రోగం పేరు సిట్టింగ్ డిసీజ్. 

మ‌రి ఏం చేయాలి?

ప్ర‌తి అర‌గంట‌కు లేచి ఓసారి న‌డుం విరుచుకోండి. కాసేపు అటూ ఇటూ తిర‌గండి. కుదిరితే కాఫ్ రైసెస్ (Calf Raises) చేయండి.

వ‌ర్క్‌లో ఉన్న ఫోన్ వ‌స్తే అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడండి.

మీ ఆరోగ్యాన్ని బ‌ట్టి కార్యాల‌యాల్లో లిఫ్ట్ బ‌దులు మెట్లు ఎక్కేందుకు ప్ర‌య‌త్నించండి.

ఒక‌వేళ మీ ఆఫీస్ నాలుగు లేదా ఐదో ఫ్లోర్‌లో ఉంటే కనీసం మూడో అంత‌స్తు వ‌ర‌కు మెట్లు ఎక్కి అక్క‌డి నుంచి లిఫ్ట్ ఎక్కండి.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • win444app says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Win444app, huh? Trying it out tonight. It feels great so far! I hope you enjoy it! Check it out here: win444app
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top