Donald Trump: ర‌ష్యా మెరుపు దాడులు.. వాట్ ద హెల్

Donald Trump: ర‌ష్యాకి ఉక్రెయిన్‌కి మ‌ధ్య యుద్ధం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా లేదు. రా క‌లిసి కూర్చుని మాట్లాడుకుందాం అంటూ ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీని ఊరించి.. ఉన్న‌ట్టుండి ఉక్రెయిన్‌పై అతిపెద్ద మెరుపు దాడులు చేయించాడు. దాంతో ప్ర‌పంచం ఉలిక్కి ప‌డింది. ఆదివారం అర్థ‌రాత్రి ఒక్క‌సారిగా 367 డ్రోన్ మిస్సైల్స్‌తో ర‌ష్యా ఉక్రెయిన్‌పై దాడి జ‌రిపింది.

ఈ దాడుల్లో దాదాపు 12 మంది మృతిచెంద‌గా వంద‌లాది మంది గాయ‌ప‌డ్డారు. ఉక్రెయిన్ వైమానిక ద‌ళాలు రష్యాకి చెందిన 45 మిస్సైల్స్, 266 డ్రోన్స్ కూల్చేసాయి. ఈ దాడుల కార‌ణంగా ఉక్రెయిన్‌లోని దాదాపు 30 గ్రామాలు అట్టుడికిపోయాయి. ఈ నేప‌థ్యంలో అమెరిక‌న్ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ప‌బ్లిక్‌గా పుతిన్‌పై వాట్ ద హెల్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. పుతిన్ ఉక్రెయిన్ మొత్తం దోచేసుకుంటానంటే చివ‌రికి నేల‌మ‌ట్టం అయ్యేది ర‌ష్యానే అని గుర్తుంచుకోవాల‌ని ట్రంప్ అన్నారు.

ట్రంప్‌తో పుతిన్‌కి మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి. కానీ పుతిన్ ఉక్రెయిన్‌పై చేసిన మెరుపు దాడుల కార‌ణంగా ట్రంప్ ఆయ‌న్ను అస‌హ్యించుకుంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు పుతిన్ బాగానే ఉన్నాడ‌ని.. ఇప్పుడు అమాయ‌క ప్ర‌జ‌ల‌ను చంపేస్తూ పిచ్చి పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని అన్నారు. ఈ విష‌యంలో ఆయ‌న పుతిన్ ప‌ట్ల సంతోషంగా లేన‌ని తెలిపారు. ఈ యుద్ధానికి ముగింపు ప‌లికేందుకు పుతిన్, జెలెన్‌స్కీ కూర్చుని మాట్లాడుకోవాల‌ని ట్రంప్ స‌ల‌హా ఇవ్వ‌డంతో ఇందుకు ముందు పుతిన్ ఒప్పుకున్నారు. ఈ శాంతి స‌మావేశాలు ట‌ర్కీ వేదిక‌గా జ‌ర‌గాల్సి ఉంది. కానీ పుతిన్ వ‌స్తాను వ‌స్తాను అంటూ ఆ స‌మావేశానికి రాక‌పోగా ఉక్రెయిన్‌పై ఉన్న‌ట్టుండి విరుచుకుప‌డ‌టం ప‌ట్ల ప్ర‌పంచ దేశాలు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *