Prithviraj Chavan అమెరికా వెనెజ్వెలా మధ్య సంఘర్షణ నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చావన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ట్యారిఫ్లు విధిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉంటారని.. ఆయన అమెరికా అంటే భయపడుతున్నారని అన్నారు. ఇప్పుడు వెనెజ్వెలా అధ్యక్షుడిని నిర్దాక్షిణ్యంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తే అది తప్పు అని కూడా మోదీ ఖండించలేకపోయారని.. అలాంటి పరిస్థితే భారత్లో నెలకొంటే ట్రంప్ మోదీని కూడా ఎత్తుకుపోతారా? అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీస్తున్నాయి.