పెద్ద‌న్న ప్లాన్ హిట్టు.. నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తానంటున్న మ‌రియా

USA Venezuela అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన ప్లాన్ సూప‌ర్ హిట్ అయ్యింది. వెనెజ్వెలా అధ్య‌క్షుడు నికోలా మ‌డురోని మాద‌క‌ద్ర‌వ్యాల‌ను అమెరికాకు పంపిణీ చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌తో మెరుపు దాడులు చేసి మ‌రీ మ‌డురోని అత‌ని స‌తీమ‌ణిని న్యూయార్క్ ఎత్తుకొచ్చేసారు. ఈరోజు మ‌డురోని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. అయితే.. ఇదంతా ట్రంప్ మాద‌క‌ద్ర‌వ్యాల నుంచి త‌న దేశాన్ని కాపాడుకునేందుకు చేస్తున్నాడ‌ని చెప్తున్నప్ప‌టికీ దీని వెనుక వేరే కార‌ణం ఉంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

అదేంటంటే.. వెనెజ్వెలా ప్ర‌తిప‌క్ష నేత అయిన మ‌రియాకు గ‌తేడాది నోబెల్ ప్రైజ్ వ‌రించిన సంగ‌తి తెలిసిందే. అదే నోబెల్ ప్రైజ్‌పై ట్రంప్ క‌న్ను కూడా పడింది. కానీ ట్రంప్‌కి ద‌క్క‌కుండా మ‌రియాకు ద‌క్కింది. దాంతో మ‌రియాతో చ‌ర్చ‌లు జ‌రిపి.. వెనెజ్వెలా అధ్య‌క్షుడిని త‌ప్పిస్తే మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయ‌ని అప్పుడు తానే వెనెజ్వెలాకు అధ్య‌క్షురాలిని అవుతాన‌ని ట్రంప్‌తో మాట్లాడుకున్న‌ట్లు టాక్‌. ఇందుకు ట్రంప్ ఒప్పుకున్నాడు కానీ.. ఇలా చేసినందుకు గానూ నోబెల్ ప్రైజ్ ఇవ్వాల‌ని అడిగార‌ట‌. ఇందుకు మ‌రియా ఒప్పుకుంది. ఇప్పుడు ట్రంప్ చెప్పిన‌ట్లే మ‌డురోని అమెరికా కోర్టుకు ఈడ్చ‌డంతో మ‌రియా ఫుల్ హ్యాపీగా ఉంది. ఈ నేప‌థ్యంలో ఆమె త‌న‌కు వ‌చ్చిన నోబెల్ ప్రైజ్‌ను ట్రంప్‌కు ఇస్తాన‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *