పుట్టెడు దుఖంలో ఉన్న భార‌త్‌పై విచారణ ఏంట్రా?

Pahalgam Attack: అమెరికా, బ్రిట‌న్ వంటి దేశాల మెప్పు పొందేందుకే ఇంత‌కాలం ఉగ్ర‌వాదుల‌ను ప్రోత్స‌హిస్తూ భార‌త్‌పై ఉగ్ర‌దాడులు చేయించాం. ఇది 30 ఏళ్లుగా మేం చేసిన చెత్త ప‌ని అని స్వ‌యంగా పాకిస్థాన్ ర‌క్ష‌ణ శాఖ మంత్రి ఖ్వాజా అసిఫ్ ఓ అంత‌ర్జాతీయ మీడియా ద్వారా బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కాలం భార‌త్‌లో ఉగ్రదాడులు చేయిస్తోంది పాకిస్థానే అని మ‌న‌కు కూడా తెలుసు. మ‌న‌కే కాదు మ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచే చాలా దేశాల‌కు కూడా తెలుసు. అయినా పాక్ ఏమీ తెలీని నంగ‌నాచిలా అమాయ‌కంగా వ్య‌వ‌హ‌రించేది. ఇప్పుడు ఎటూ వారి నోటితో వారే ఒప్పుకున్నారు కాబ‌ట్టి ప్ర‌పంచ‌దేశాలు కూడా సాక్ష్యంగా నిలిచాయి.

మ‌రోప‌క్క పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ షెరీఫ్‌.. భార‌త్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగిన ప్ర‌తీసారి పాక్‌నే నిందిస్తూ వ‌స్తున్నార‌ని.. ఈసారి కూడా అదే జ‌రుగుతోంద‌ని అన్నారు. భార‌త్ చేసే విచార‌ణ‌లో తాము పార‌ద‌ర్శ‌కంగా విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తాం అని వెల్ల‌డించారు. ఇంత‌వ‌ర‌కు ఓకే కానీ.. ఇప్పుడు ఖ్వాజా అసీఫ్ యూ ట‌ర్న్ తీసుకున్నాడు. ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌దాడికి పాక్‌కు సంబంధం లేద‌ని.. భార‌త్ చేస్తున్న విచార‌ణ‌లో ఎంత వ‌ర‌కు న్యాయం ఉందో, ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ వివ‌రాలు ల‌భించాయో తెలియాలంటే అమెరికా, చైనా వంటి దేశాలు అంత‌ర్జాతీయ విచార‌ణ చేప‌ట్టాల‌ని అంటున్నాడు. అదేంది? స‌ర‌దాగా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్న అమాయ‌క భార‌త పౌరుల‌ను క‌డుపున పెట్టుకుందే కాకుండా పుట్టెడు దుఖంలో ఉన్న భార‌త్‌పై అంత‌ర్జాతీయ విచార‌ణ చేయించాలా? సింధూ జ‌లాల‌ను ఆపేయడంతో పాక్‌కి మొత్తానికే బ్రెయిన్ దొబ్బినట్లుందంటూ ప‌లువురు నేత‌లు, ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *