NTR Neel: రిలీజ్ డేట్ ప్ర‌క‌టించిన తార‌క్

NTR Neel: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న డ్రాగ‌న్ సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది. తారక్ సోష‌ల్ మీడియా వేదిక‌గా రిలీజ్ డేట్‌ను ప్ర‌కటించారు. 2026 జూన్ 25న సినిమా రిలీజ్ కానుంద‌ని వెల్ల‌డిస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు.

ఏప్రిల్ 22న షూటింగ్ క‌ర్ణాట‌క‌లో మొదలైంది. ఇదొక ప్యూర్ ప్యాన్ వ‌ర‌ల్డ్ స్ట‌ఫ్‌గా ఉండ‌బోతోంద‌ని ఆల్రెడీ హింట్స్ ఇచ్చేస్తున్నారు. 1960ల్లో బంగ్లాదేశ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌లా ఓ పీరియాడిక్ సినిమాగా ఉండ‌బోతోంది. బంగ్లాదేశ్‌కు వ‌ల‌స వ‌చ్చిన తెలుగు వారిని కాపాడేందుకు రంగంలోకి దిగే ఫైట‌ర్‌గా తార‌క్ క‌నిపించ‌బోతున్నారు.

గోల్డెన్ ట్రాయాంగిల్ (భార‌త్, చైనా, భూటాన్ స‌రిహ‌ద్దులు) వ‌ద్ద జ‌రిగే బంగారం అక్ర‌మ ర‌వాణా అంశం కూడా ఇందులో ఉండబోతోంద‌ట‌. క‌ర్ణాట‌క‌లో కొంత చిత్రీక‌ర‌ణ జ‌రిపి మిగ‌తాది రామోజీ ఫిలిం సిటీలో తీస్తారు. స‌ప్త‌సాగ‌రాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. మ‌లయాళ న‌టులు టోవినో థామ‌స్, బిజు మేన‌న్‌లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *