ఆప‌రేష‌న్ సింధూర్ వేళ‌.. భ‌యంతో పాక్ ఎంత‌కు తెగించిందో తెలుసా?

Operation Sindoor గ‌తేడాది పాకిస్థాన్‌కి చెందిన ఉగ్ర‌మూక జమ్మూకాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాం ప్రాంతంలో ప‌ర్య‌టిస్తున్న భార‌తీయ హిందువులపై విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. దీనికి ధీటుగా భార‌త్ ఆప‌రేష‌న్ సింధూర్ పేరిట పాక్‌కు బుద్ధిచెప్పింది. అయితే.. భార‌త్ ఆప‌రేషన్ సింధూర్ పేరిట LOC స‌మీపంలోని 9 ఉగ్ర స్థావ‌రాల‌ను పేల్చేసింది. ఈ నేప‌థ్యంలో పాక్ భ‌యంతో వ‌ణికిపోయింది.

తిన‌డానికి తిండి, తాగేందుకు నీరు లేక ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతున్న పాక్‌.. భార‌త్ దాడి నుంచి త‌ప్పించుకునేందుకు అమెరికా సాయం అడిగింది. ఈ విష‌యాన్ని ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేష‌న్ యాక్ట్ (FARA) అధికారికంగా వెల్ల‌డించింది. FARA చ‌ట్టం ప్ర‌కారం.. ఏ దేశ‌మైన డ‌బ్బులు ఇచ్చి లాబీయింగ్‌కు పాల్ప‌డితే ఆ దేశానికి సంబంధించిన వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించే హ‌క్కు ఉంది. ఈ నేప‌థ్యంలో ఆప‌రేష‌న్ సింధూర్ జ‌రిగిన రెండు రోజుల్లోనే పాక్ దాదాపు రూ.45 కోట్ల‌ను అమెరికాకి చెందిన దాదాపు ఆరు లాబీయింగ్ సంస్థ‌ల‌కు పంపించింది. ఈ సంస్థ‌ల ద్వారా అమెరికన్ ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపి దాడిని ఆపేందుకు య‌త్నించింది.

సింపుల్‌గా చెప్పాలంటే పాక్ అమెరికాకి చెందిన లామేక‌ర్స్‌కు కోట్ల రూపాయ‌లు డ‌బ్బు ఇచ్చి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సంప్రదించ‌గ‌లిగింది. ఆ త‌ర్వాతే ట్రంప్ కాల్పులు విర‌మించాల‌ని ఒప్పందం కుదిర్చే ప్ర‌య‌త్నం చేసారు. కానీ కాల్పుల విర‌మ‌ణ‌ను పాక్ మాత్రం ఆప‌లేదు. అయితే.. ఎవ‌రు ఎవ‌రితో లాబియింగ్ చేసిన‌ప్ప‌టికీ.. పాక్ భార‌త్ మ‌ధ్య మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేసింది మాత్రం అమెరికా కాద‌ని భార‌త ప్ర‌భుత్వం నొక్కిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *