Katrina Kaif Son Name బాలీవుడ్ నటులు కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ దంపతులు గతేడాది నవంబర్లో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఈరోజు బిడ్డకు నామకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబుకు విహాన్ కౌషల్ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. అయితే.. కత్రినా, విక్కీలు విహాన్ అనే పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది. విక్కీ కెరీర్లో చిరకాలం గుర్తుండిపోయే సినిమా ఉరీ. ఈ సినిమాలో విక్కీ పేరు మేజర్ విహాన్ సింగ్ షేర్గిల్. అలా తనకు చిరకాలం గుర్తుండిపోయే సినిమాలోని తన పాత్ర పేరును బిడ్డకు పెట్టాలనుకున్నట్లు తెలుస్తోంది.