Dhanush Nayanthara “న‌య‌న‌తార అబ‌ద్ధాల కోరు”

Dhanush Nayanthara లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార పెళ్లి డాక్యుమెంట‌రీ న‌య‌న‌తార‌: బియాండ్ ది ఫెయిరీ టెయిల్ విష‌యంలో త‌మిళ న‌టుడు ధ‌నుష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ధ‌నుష్ నిర్మించిన నానుమ్ రౌడీ ధాన్ సినిమాలో.. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్.. న‌య‌న్ క‌లిసున్న మూడు సెకెన్ల సీన్‌ను డాక్యుమెంట‌రీలో వాడ‌టంతో ఆయ‌న మండిప‌డ్డారు. త‌న అనుమ‌తి లేకుండా త‌న సినిమాలోని స‌న్నివేశాన్ని వాడుకున్నందుకు గానూ రూ.10 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్ చేసిన‌ట్లు న‌య‌న‌తార ఇటీవ‌ల సంచ‌ల‌న లేఖ రిలీజ్ చేసారు.

అయితే.. న‌య‌న‌తార లేఖ ప్ర‌కారం.. రెండేళ్లుగా NOC కోసం ధ‌నుష్‌ని అడుక్కుంటున్నా అత‌ను త‌న సినిమాలోని సీన్‌ని వాడుకోవ్వ‌లేద‌ని.. దాంతో తామే ఎడిట్ చేసి వాడుకున్నామ‌ని తెలిపారు. దీనిపై ధ‌నుష్ తండ్రి క‌స్తూరి రాజా స్పందించారు. ధ‌నుష్‌ని రెండేళ్లుగా NOC కోసం అడుక్కుంటున్నానని న‌య‌న్ వెల్ల‌డించార‌ని.. అందులో ఏమాత్రం నిజం లేద‌ని అన్నారు. న‌య‌న్ ఓ అబ‌ద్ధాల కోర‌ని ఆరోపించారు. ఇలాంటి చిల్ల‌ర కామెంట్స్ చేసే వారి గురించి పట్టించుకునేంత స‌మ‌యం ధ‌నుష్‌కి లేద‌ని.. అత‌ను సినిమాల‌తో బిజీగా ఉన్నార‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *