Bangladesh: పాక్‌పై దాడి చేస్తే.. ఆ 7 రాష్ట్రాలు మావే

Bangladesh: ప‌హ‌ల్గాం భీక‌ర ఘ‌ట‌న‌కు ఎలాగైనా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భార‌త ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఇప్ప‌టికే సింధూ జ‌లాల‌ను నిలిపివేసింది. ఈసారి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ కాకుండా కేంద్రం పాక్‌పై ఫైనాన్షియ‌ల్ స్ట్రైక్స్ చేయాల‌నుకుంటోంది. ఇద్ద‌రు కొట్టుకుంటే మూడో వాడికి లాభం అన్న‌ట్లు.. పాక్ చేసే వెధ‌వ ప‌నుల‌కు భార‌త్ బుద్ధి చెప్దాం అనుకుంటున్న స‌మ‌యంలో బంగ్లాదేశ్ త‌న వ‌క్ర‌బుద్ధిని బ‌య‌ట‌పెట్టింది.  భార‌త్ పాక్‌పై దాడి చేస్తే.. మ‌న భార‌త‌దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల‌ను బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకుంటుంద‌ట‌.

ఈ విష‌యాన్ని బంగ్లాదేశ్ విశ్రాంత ఆర్మీ అధికారి అయిన‌ ఫ‌జ్లూర్ రెహ‌మాన్ వెల్ల‌డించారు. ఈ మాట‌ను ఆయ‌న బంగ్లాదేశ్‌లో కూర్చుని మీడియాతో మాట్లాడాడ‌నుకుంటే పొర‌పాటే. చైనాకి వెళ్లి అక్క‌డి అధికారుల వ‌ద్ద ఈ ప్ర‌స్తావ‌న తెచ్చాడు. ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాల‌య‌, మ‌ణిపూర్, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌ను మ‌నం సెవెన్ సిస్ట‌ర్స్ అని పిలుచుకుంటాం. ఈ సెవెల్ సిస్ట‌ర్స్‌ను బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకునేందుకు చైనా సాయం తీసుకుంటుంద‌ని రెహ‌మాన్ వెల్ల‌డించాడు.

ఈ రెహ్మాన్ అనే వ్యక్తి బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మ‌హ్మ‌ద్ యూన‌స్‌కు బాగా కావాల్సిన వ్య‌క్తి. యూన‌స్ ప్లాన్ ప్ర‌కార‌మే రెహ్మాన్ ఈ వ్యాఖ్య‌లు చేస్తున్నాడు. ఇలాంటి వారు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటే మ‌నం ఊరుకుంటామా? అందుకే మ‌న దేశం దీటైన స‌మాధానం ఇచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్లు, రైళ్లు, పైప్‌లైన్లు.. ఇలా అన్ని మౌళిక స‌దుపాయాల‌న్నీ భార‌త ప్ర‌భుత్వ‌మే చూసుకుంటోంద‌ని… ఆ రాష్ట్రాల‌పై పూర్తి బాధ్య‌త భార‌త ప్ర‌భుత్వానిదే అని వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *