Lord Vishnu: ప్ర‌తి గురువారం ఇలా చేస్తే ల‌క్ష్మీదేవి కొలువై ఉంటుంది

Lord Vishnu:  మ‌నం ఎన్ని గుళ్ల‌కు వెళ్లినా, ఎన్ని పూజ‌లు చేసినా ఆర్థికంగా, మాన‌సికంగా, శారీర‌కంగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా ఉండ‌టానికే క‌దా..! ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు రాకూడ‌ద‌ని గ‌ట్టిగా మొక్కుకుంటూ ఉంటాం. అయితే.. విప‌రీత‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్న‌వారికి ఒక ప‌రిహారం ఉంది. ఈ ప‌రిహారాన్ని విష్ణువు, బృహ‌స్ప‌తికి ప్రీతిక‌ర‌మైన రోజు. ప్ర‌తి గురువారం సాయంత్రం ఈ ప‌రిహారాలు చేస్తే ఆర్థికంగా మెరుగుప‌డ‌తారు. ఇంత‌కీ ఆ ప‌రిహారాలు ఏంటంటే..

గురువారం సాయంత్రం సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇంట్లో అర‌టి చెట్టు ఉంటే దాని మొద‌ళ్ల‌లో ఒక రూపాయి నాణేన్ని పాతిపెట్టండి. అర‌టి చెట్టును ల‌క్ష్మీదేవితో స‌మానంగా కొలుస్తారు.

గురువారం సాయంత్రం ఓ ప‌సుపు రంగు వ‌స్త్రంలో రూపాయి నాణెం, బెల్లం ముక్క‌, ఏడు ప‌సుపు ముద్ద‌లు వేసి మూట క‌ట్టి ఏదైనా న‌దిలో వేయండి.

గురువారం రోజున విష్ణు మూర్తి ఆల‌యంలో గోధుమ‌లు, బెల్లం దానంగా ఇవ్వండి.

గురువారం ఉద‌యం స్నానం అయ్యాక వీలైతే అర‌టి చెట్టు ద‌గ్గ‌ర కాసిన్ని శెన‌గ‌లు ఉంచండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *