Operation Sindoor: క‌లిసి పోరాడి.. క‌న్నీళ్లు తుడిచి

Operation Sindoor: భార‌త‌దేశ‌మే కాదు.. ఎక్క‌డ మ‌నం దాడి చేస్తామో అని బిక్కుబిక్కు మంటున్న పాకిస్థాన్ ప్ర‌జ‌లు నిద్ర‌పోయిన త‌ర్వాత భార‌త్ ఒక్క‌సారిగా మెరుపు దాడుల‌తో విరుచుకుప‌డింది. ఉద‌యం లేచి చూసే స‌రికి ఎవ‌రి నోట విన్నా ఆప‌రేష‌న్ సింధూర్, భార‌త్ మాతా కీ జై అన్న మాట‌లే విన‌ప‌డుతున్నాయ్‌. 26 మంది అమాయ‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌మూక‌ల‌ను మ‌ట్టుబెట్టేందుకు రాత్రికి రాత్రి భార‌త ఆర్మీ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌లో దాదాపు 100 మంది ఉగ్ర‌వాదులు చ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

అయితే.. ఈసారి ఈ ఆప‌రేష‌న్‌లో భార‌త్‌కు చెందిన మూడు ద‌ళాలు.. అంటే ఆర్మీ, నేవీ, వైమానిక ద‌ళాలు పాల్గొన్నాయి. ఇలా మూడు ద‌ళాలు క‌లిసి పాల్గొన్న‌ది చివ‌రిసారిగా 1971లో జ‌రిగిన యుద్ధంలోనే. మ‌ళ్లీ ఇప్పుడు ఈ మూడు ద‌ళాలు క‌లిసి భార‌త‌దేశ ఆడ‌బిడ్డ‌ల ప‌సుపు కుంకాలు తుడిచేసిన ఉగ్ర‌మూక‌ల‌ను మట్ట‌బెట్టి వారి క‌న్నీళ్లు తుడిచాయి. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌తో పాటు, పాకిస్థాన్‌లోని 9 ఉగ్ర స్థావ‌రాల‌ను మ‌న ఆర్మీ టార్గెట్ చేసి మ‌రీ పేల్చేసింది. ఏ ఒక్క సాధార‌ణ పౌరుడు కూడా ఈ ఆప‌రేష‌న్‌లో చ‌నిపోలేదు. అది మ‌న గొప్ప‌త‌నం. మ‌నం కావాలనుకుంటే ఎవ‌రు చ‌చ్చినా ఫ‌ర్వాలేదు ఉగ్ర శిబిరాలు, ఉగ్ర‌వాదులు చ‌స్తే చాలు అనుకోవ‌చ్చు.

కానీ మ‌న‌ది పాక్ లాంటి నీచ బుద్ధి కాదు క‌దా. స‌రిగ్గా టార్గెట్‌పై దాడి చేసేలా మ‌న ఆర్మీ కామికేజ్ డ్రోన్స్ వాడింది. ఈ డ్రోన్స్ టార్గెట్ సెట్ చేసిన ప్ర‌దేశానికి మాత్ర‌మే వెళ్లి పేల్చేస్తుంది. ఈ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం అయ్యేలా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాత్రంతా ప‌రిస్థితిని మానిట‌ర్ చేస్తూనే ఉన్నారు. ఆప‌రేష‌న్ ముగిసాక భార‌త జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోభాల్ అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు, స్టేట్ సెక్ర‌ట‌రీ అయిన మార్కో రూబియోకి ప‌రిస్థితిని వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *