Pawan kalyan: అదే చేత్తో కాస్త OG కూడా…

Pawan kalyan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా బిజీ అయిపోయారు. దాంతో ఆయ‌న ఒప్పుకున్న సినిమా షూటింగ్‌లు కూడా నిలిచిపోయాయి. క్రిష్ జాగ‌ర్ల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా అటకెక్కింది అనుకున్నారు. కానీ ప‌వ‌న్ సినిమాను ఒప్పుకుని మ‌ధ్య‌లో అలా వ‌దిలేయ‌రు. అందుకే స‌మ‌యం చూసుకుని ఒక రోజంతా ఈ సినిమా షూటింగ్‌కి త‌న స‌మ‌యాన్ని కేటాయించి ఎట్ట‌కేల‌కు షూటింగ్ పూర్తి చేసేసారు. విజువ‌ల్ ఫీస్ట్‌కి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ షూటింగ్ పిక్ ఒక‌టి టీం షేర్ చేసింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు త్వ‌ర‌లో పూర్తి అవుతాయి. ఇక‌పోతే.. ప‌వ‌న్ నుంచి హ‌రిహ‌ర వీర‌మ‌ల్లుతో పాటు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్, ఓజీ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఫ్యాన్స్ చాలా మ‌టుకు ఓజీపైనే ఆశ‌లు పెట్టుకున్నారు. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ప‌వ‌న్ వింటేజ్ లుక్‌లో ఓ గ్యాంగ్‌స్టర్ మాదిరిగా క‌నిపించ‌బోతున్నార‌ని నెత్తు మ‌రిగిన హంగ్రీ చీతా అనే సాంగ్ టీజ‌ర్‌తో చెప్ప‌క‌నే చెప్పారు. ప‌వన్ అలా గ‌న్ను ప‌ట్టుకుని ఒక్కొక్క గూండాని ఏరి పారేస్తుంటే చూడాల‌ని ఏ అభిమానికి మాత్రం ఉండ‌దు చెప్పండి. అందుకే కాస్త పెద్ద‌మ‌న‌సు చేసుకుని ఓజీ సినిమా షూటింగ్ కూడా త్వ‌ర‌లో పూర్తి చేసేస్తే బాగుంటుంది క‌దా అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఉన్న బిజీకి విదేశాల్లో జ‌ర‌గాల్సిన షూటింగ్ మంగ‌ళ‌గిరికి త‌ర‌లించాల‌ని టీం అనుకుంటోంద‌ట‌. అవుట్‌పుట్ ఎలా ఉంటుందో చూడాలి మ‌రి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *