Search The Query
Search

Image
  • Home
  • Health
  • Exercise On Empty Stomach – ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయచ్చా?

Exercise On Empty Stomach – ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయచ్చా?

Exercise On Empty Stomach ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేసి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎవ‌రి శ‌రీరాల‌కు త‌గ్గ‌ట్టు వారు వ్యాయామం చేసుకోవాలి. అంతేకానీ ప‌క్క‌నోడిని చూసి వాడు 100 కిలోలు ఎత్తాడు కాబ‌ట్టి నేను కూడా 120 కిలోలు ఎత్తుతాను అంటే ప్ర‌మాద‌మే. నిపుణుల స‌ల‌హాతో వ్యాయామ‌లు చేస్తే ఎంతో మంచిది. ఇక‌పోతే.. వ్యాయామం చేసే ముందు తినాలా వ‌ద్దా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. ఖాళీ క‌డుపుతో చేస్తే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు అని కూడా అంటుంటారు. ఇందులో కొంత శాతం నిజం ఉన్న‌ప్ప‌టికీ అంద‌రికీ వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు.

ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే శరీరానికి, ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలను ఇస్తుంది. ఇది శరీరంలో స్టోర్ అయి ఉన్న కొవ్వును వాడుకుంటుంది కాబ‌ట్టి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ఇందులో ఎలాంటి డౌట్ అక్క‌ర్లేదు. మెటబోలిజాన్ని కూడా పెంచుతుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన‌ర్జీని పెంచుతుంది. సాధారణంగా మనం ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేస్తే శరీరం గ్లైకోజన్‌ను ఎన‌ర్జీగా వాడుకుంటుంది. కానీ ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేసే సమయంలో శరీరం గ్లైకోజన్‌కి బ‌దులు ఆల్రెడీ పేరుకుపోయి ఉన్న‌ కొవ్వును ఎనర్జీగా వాడుకుంటుంది. త‌ద్వారా శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోయి నాజూగ్గా త‌యార‌య్యేలా చేస్తుంది.

ఖాళీ క‌డుపుతో వ్యాయామం.. ప్ర‌యోజ‌నాలు

కొవ్వు కాల్పన పెరగడం
ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేసే సమయంలో శరీరం గ్లైకోజన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో శరీరంలో ఆల్రెడీ ఉన్న‌ కొవ్వును ప్రధానంగా ఉపయోగిస్తుంది, తద్వారా కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం
క‌డుపులో ఏమీ లేన‌ప్పుడు వ్యాయామం చేస్తే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను శరీరంలోని కణాలు సమర్థవంతంగా పీల్చుకోవడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన బ్ల‌డ్ షుగర్ లెవెల్స్‌ను స‌మ‌గ్రంగా ఉంచ‌డంలో సహాయపడుతుంది.

గ్రోత్ హార్మోన్లు పెంచుతుంది
Exercise On Empty Stomach గ్రోత్ హార్మోన్ అంటే కండ‌రాల‌ను ప‌టిష్ఠంగా ఉంచ‌డంలో కీల‌క పాత్ర పోషించే హార్మోన్లు. క‌డుపు ఖాళీగా ఉన్న‌ప్పుడు వ్యాయామం చేస్తే ఈ గ్రోత్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దీని వ‌ల్ల‌ కండరాలు బ‌లంగా మార‌తాయి. కండ‌రాల రిక‌వ‌రీతో కొవ్వు తేలిగ్గా క‌రిగిపోతుంది.

మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెరగడం
ఖాళీ క‌డుపుతో చేసే వ్యాయామం వ‌ల్ల మ‌న శ‌రీరం కార్బ్స్, ఫ్యాట్‌ని స‌మ‌ర్ధ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. ఇది మెటబోలిక్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. మెట‌బాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెరిగేందుకు సైక్లింగ్, స్విమ్మింగ్ మరీ మంచివి.

ఎక్కువ ఎన‌ర్జీ
ఇలా ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎన‌ర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఎక్కువ సేపు వ్యాయామం చేసినా కూడా పెద్ద‌గా అల‌స‌ట అనిపించ‌దు.

ఈజీగా బ‌రువు త‌గ్గుతారు
మ‌నం వ్యాయమం ఎందుకు చేస్తాం? చాలా మందైతే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకునేందుకు.. సన్న‌గా నాజూగ్గా క‌నిపించేందుకే చేస్తారు. అలాంటి వారికి ఇలా ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయ‌డం చ‌క్క‌టి ఫ‌లితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే ఎక్కువ‌గా ఆక‌లి వేయ‌డం.. క్రేవింగ్స్ వంటివి ఉండ‌వు. మ‌న‌కు కావాల్సింది కూడా అదే క‌దా..!

గుండె ప‌దిలం
ఖాళీ క‌డుపుతో వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కూడా ప‌దిలంగా ఉంచుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. మ‌న ఆలోచ‌నా విధానం క్లారిటీగా ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలోనే మంచి నిర్ణ‌యాలు త‌డ‌తాయ‌ట‌. మూడ్ కూడా బాగుంటుంది.

చూసారుగా.. ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలు. కాక‌పోతే ఇందాక చెప్పిన‌ట్లు ఇది ప్రతి ఒక్కరికీ పనిచేస్తుంద‌ని చెప్ప‌లేం. మీరు ఈ విధానాన్ని అనుసరించాలనుకుంటే ముందు మీ ఆరోగ్య నిపుణుల నుండి సలహా తీసుకోవడం మంచిది.

More News

tips for Breast Milk Production
చ‌నుబాలు రావ‌డం లేదా?
BySai KrishnaJan 30, 2026

Breast Milk Production బిడ్డ పుట్టిన త‌ర్వాత త‌ల్లులు ఆరు నెల‌ల పాటు వారికి చ‌నుబాలు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే…

Money Saving Tips for you
డ‌బ్బులేవీ?
BySai KrishnaJan 30, 2026

Money Saving Tips సాల‌రీ ప‌డింది. రెంట్ క‌ట్టేసాం. EMI క‌ట్టేసాం. మ‌ళ్లీ వచ్చే నెల‌లో ప‌డే సాల‌రీ కోసం…

how to overcome Over Eating
ఓవ‌ర్ ఈటింగ్ త‌గ్గేదెలా
BySai KrishnaJan 30, 2026

Over Eating బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి.. బ‌రువుని అదుపులో పెట్టుకోవాల‌నుకునేవారికి ఉన్న ఏకైక ప్ర‌ధాన స‌మ‌స్య ఓవ‌ర్ ఈటింగ్. అదేనండీ.. ఆక‌లి…

Sitting for too long is as equal as smoking
కూర్చున్నా సిగ‌రెట్ తాగినా ఒక్క‌టే
BySai KrishnaJan 26, 2026

Sitting for too long పొగ‌తాగ‌డం ఆరోగ్యానికి ఎంత హానిక‌ర‌మో.. ఎక్కువ సేపు కూర్చున్నా కూడా అంతే హాని అని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top