Search The Query
Search

Image
  • Home
  • Health
  • Exercise On Empty Stomach – ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయచ్చా?

Exercise On Empty Stomach – ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయచ్చా?

Exercise On Empty Stomach ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేసి తీరాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎవ‌రి శ‌రీరాల‌కు త‌గ్గ‌ట్టు వారు వ్యాయామం చేసుకోవాలి. అంతేకానీ ప‌క్క‌నోడిని చూసి వాడు 100 కిలోలు ఎత్తాడు కాబ‌ట్టి నేను కూడా 120 కిలోలు ఎత్తుతాను అంటే ప్ర‌మాద‌మే. నిపుణుల స‌ల‌హాతో వ్యాయామ‌లు చేస్తే ఎంతో మంచిది. ఇక‌పోతే.. వ్యాయామం చేసే ముందు తినాలా వ‌ద్దా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. ఖాళీ క‌డుపుతో చేస్తే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు అని కూడా అంటుంటారు. ఇందులో కొంత శాతం నిజం ఉన్న‌ప్ప‌టికీ అంద‌రికీ వ‌ర్తించ‌క‌పోవ‌చ్చు.

ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే శరీరానికి, ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలను ఇస్తుంది. ఇది శరీరంలో స్టోర్ అయి ఉన్న కొవ్వును వాడుకుంటుంది కాబ‌ట్టి త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు. ఇందులో ఎలాంటి డౌట్ అక్క‌ర్లేదు. మెటబోలిజాన్ని కూడా పెంచుతుంది. శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన‌ర్జీని పెంచుతుంది. సాధారణంగా మనం ఆహారం తీసుకున్న తర్వాత వ్యాయామం చేస్తే శరీరం గ్లైకోజన్‌ను ఎన‌ర్జీగా వాడుకుంటుంది. కానీ ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేసే సమయంలో శరీరం గ్లైకోజన్‌కి బ‌దులు ఆల్రెడీ పేరుకుపోయి ఉన్న‌ కొవ్వును ఎనర్జీగా వాడుకుంటుంది. త‌ద్వారా శ‌రీరంలోని కొవ్వు క‌రిగిపోయి నాజూగ్గా త‌యార‌య్యేలా చేస్తుంది.

ఖాళీ క‌డుపుతో వ్యాయామం.. ప్ర‌యోజ‌నాలు

కొవ్వు కాల్పన పెరగడం
ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేసే సమయంలో శరీరం గ్లైకోజన్ నిల్వలు తక్కువగా ఉంటాయి. ఈ సమయంలో శరీరంలో ఆల్రెడీ ఉన్న‌ కొవ్వును ప్రధానంగా ఉపయోగిస్తుంది, తద్వారా కొవ్వు త్వ‌ర‌గా క‌రుగుతుంది.

ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం
క‌డుపులో ఏమీ లేన‌ప్పుడు వ్యాయామం చేస్తే శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను శరీరంలోని కణాలు సమర్థవంతంగా పీల్చుకోవడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన బ్ల‌డ్ షుగర్ లెవెల్స్‌ను స‌మ‌గ్రంగా ఉంచ‌డంలో సహాయపడుతుంది.

గ్రోత్ హార్మోన్లు పెంచుతుంది
Exercise On Empty Stomach గ్రోత్ హార్మోన్ అంటే కండ‌రాల‌ను ప‌టిష్ఠంగా ఉంచ‌డంలో కీల‌క పాత్ర పోషించే హార్మోన్లు. క‌డుపు ఖాళీగా ఉన్న‌ప్పుడు వ్యాయామం చేస్తే ఈ గ్రోత్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. దీని వ‌ల్ల‌ కండరాలు బ‌లంగా మార‌తాయి. కండ‌రాల రిక‌వ‌రీతో కొవ్వు తేలిగ్గా క‌రిగిపోతుంది.

మెటబాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెరగడం
ఖాళీ క‌డుపుతో చేసే వ్యాయామం వ‌ల్ల మ‌న శ‌రీరం కార్బ్స్, ఫ్యాట్‌ని స‌మ‌ర్ధ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. ఇది మెటబోలిక్ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. మెట‌బాలిక్ ఫ్లెక్సిబిలిటీ పెరిగేందుకు సైక్లింగ్, స్విమ్మింగ్ మరీ మంచివి.

ఎక్కువ ఎన‌ర్జీ
ఇలా ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎన‌ర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఎక్కువ సేపు వ్యాయామం చేసినా కూడా పెద్ద‌గా అల‌స‌ట అనిపించ‌దు.

ఈజీగా బ‌రువు త‌గ్గుతారు
మ‌నం వ్యాయమం ఎందుకు చేస్తాం? చాలా మందైతే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించుకునేందుకు.. సన్న‌గా నాజూగ్గా క‌నిపించేందుకే చేస్తారు. అలాంటి వారికి ఇలా ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయ‌డం చ‌క్క‌టి ఫ‌లితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే ఎక్కువ‌గా ఆక‌లి వేయ‌డం.. క్రేవింగ్స్ వంటివి ఉండ‌వు. మ‌న‌కు కావాల్సింది కూడా అదే క‌దా..!

గుండె ప‌దిలం
ఖాళీ క‌డుపుతో వ్యాయామం గుండె ఆరోగ్యాన్ని కూడా ప‌దిలంగా ఉంచుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు.. ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది. మ‌న ఆలోచ‌నా విధానం క్లారిటీగా ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలోనే మంచి నిర్ణ‌యాలు త‌డ‌తాయ‌ట‌. మూడ్ కూడా బాగుంటుంది.

చూసారుగా.. ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలు. కాక‌పోతే ఇందాక చెప్పిన‌ట్లు ఇది ప్రతి ఒక్కరికీ పనిచేస్తుంద‌ని చెప్ప‌లేం. మీరు ఈ విధానాన్ని అనుసరించాలనుకుంటే ముందు మీ ఆరోగ్య నిపుణుల నుండి సలహా తీసుకోవడం మంచిది.

More News

Heart Attack In Women
Heart Attack In Women: ఇది మ‌గ‌వారి స‌మ‌స్య కాదు
BySai KrishnaJun 15, 2025

Heart Attack In Women: గుండెనొప్పిని ఇప్పటికీ మెన్స్ డిసీజ్‌గా (Mens Disease) చూస్తున్నారు. అంటే కేవ‌లం మ‌గ‌వారికి మాత్ర‌మే…

covid cases are again raising in singapore hongkong
Covid: మళ్లీ విజృంభిస్తున్న కొవిడ్
BySai KrishnaMay 15, 2025

Covid: కోవిడ్ మ‌హ‌మ్మారి ముగిసిపోయింది అనుకుంటున్న క్ర‌మంలో మ‌ళ్లీ విజృంభిస్తోంద‌న్న వార్తలు సంచ‌ల‌నం రేపుతున్నాయి. హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్…

Breakfast Or Dinner which is best to avoid
Breakfast Or Dinner ఏది మానేస్తే మంచిది?
BySai KrishnaMay 13, 2025

Breakfast Or Dinner: బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్ ఇలా మూడు పూట‌లా తినేవారు ఉన్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేసి కేవ‌లం లంచ్…

are you eating Cucumber at night
Cucumber: తినండి.. కానీ రాత్రి కాదు
BySai KrishnaMay 12, 2025

Cucumber: కొన్ని ర‌కాల కూర‌గాయ‌లు, పండ్లు ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. తిన‌కూడ‌ని స‌మ‌యాల్లో తింటే బెడిసికొడ‌తాయి. అలాంటి కూర‌గాయ‌ల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!


Scroll to Top