Masood Azhar: ఇలా చావ‌డం నా కుటుంబం చేసుకున్న అదృష్టం.. మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది షాకింగ్ వ్యాఖ్య‌లు

Masood Azhar: ఆప‌రేష‌న్ సింధూర్‌లో భాగంగా భార‌త ఆర్మీ పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాల‌పై చేసిన మెరుపు దాడిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్ర‌వాది మ‌సూద్ అజ‌హ‌ర్ కుటుంబంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో మ‌సూద్ భార్య‌, పిల్ల‌లు కూడా ఉన్నారు. మ‌సూద్ మాత్రం త‌ప్పించుకున్నాడు. ఇంత జ‌రిగాక సిగ్గులేకుండా త‌న కుటుంబం ఇలా చ‌నిపోయి అల్లా దగ్గ‌రికి వెళ్లినందుకు సంతోషంగా ఉంద‌ని.. తాను అలా చావ‌నందుకు మాత్ర‌మే బాధ‌ప‌డుతున్నాన‌ని అన్నాడు.

అతిపెద్ద ఉగ్ర సంస్థ‌ల్లో ఒక‌టైన జైషే మ‌హ్మ‌ద్ చీఫ్ మౌలానా మ‌సూద్ అజ‌హ‌ర్‌ను UN సెక్యూరిటీ కౌన్సిల్ మోస్ట్ వాంటెడ్ అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా గుర్తించింది. భార‌త్‌లో వివిధ ఉగ్ర‌దాడుల్లో కీల‌క సూత్ర‌ధారి అయిన అజ‌హ‌ర్‌ను భార‌త్ 1994లో అరెస్ట్ చేసింది. కానీ ఇత‌ని శిష్యులు ఎయిరిండియా IC 814 విమానాన్ని హైజాక్ చేసి అజ‌హ‌ర్‌ను విడిపించుకున్నారు. అప్ప‌టి నుంచి అజ‌హ‌ర్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో త‌ల‌దాచుకున్నాడు. కానీ ఎప్ప‌టిలాగే అబ్బే మా ద‌గ్గ‌ర లేడే అని పాక్ పాత పాటే పాడుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *