Operation Sindoor Planning: పాక్‌ను ఎలా వెర్రివెంగ‌ళ‌ప్ప‌ను చేసారంటే…

Operation Sindoor Planning: జ‌మ్మూ కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి అనంత‌రం భార‌త ప్రధాని న‌రేంద్ర మోదీ క‌చ్చితంగా రివెంజ్ తీర్చుకుంటార‌ని అంద‌రికీ తెలిసిందే. రాజ‌కీయంగా ఆయ‌న భావ‌జాలాలు అంటే గిట్ట‌ని వారు కూడా మోదీ త‌ప్ప‌కుండా అన్యాయంగా 26 మందిని పొట్ట‌న‌బెట్టుకున్న‌వారి అంతుచూస్తార‌ని తెలుసు. ఏప్రిల్ 22న జ‌రిగిన ప‌హ‌ల్గాం దాడి నుంచి ఈరోజు జ‌రిగిన ఆప‌రేష‌న్ సింధూర్ మెరుపు దాడి వ‌ర‌కు అస‌లు మోదీ అండ్ టీం ఎలా ప్లానింగ్ చేసారో తెలుసుకుందాం.

ఏప్రిల్ 22

ఇదే రోజున ప‌హ‌ల్గాంలోని భార‌తీయ ప‌ర్యాట‌కుల‌పై ఉగ్ర‌వాదులు భీక‌ర దాడికి పాల్ప‌డ్డారు. హిందువా ముస్లిమా అని క్లారిటీ తెచ్చుకుని మ‌రీ భార్య‌లు, పిల్ల‌ల ఎదుట మ‌గ‌వారిని కాల్చి చంపేసారు. ఈ దాడిలో 25 మంది భార‌తీయ ప‌ర్యాట‌కులు కాగా.. ఒక‌రు మాత్రం స్థానికంగా గుర్రం బండిని న‌డిపే వ్య‌క్తి ఉన్నారు. ఈ దాడి జ‌రిగిన స‌మ‌యంలో మోదీ సౌదీ అరేబియాలో ఉన్నారు. విష‌యం తెలుసుకుని వెంట‌నే త‌న ప‌ర్యాట‌న‌ను మ‌ధ్య‌లోనే నిలిపేసి భార‌త్ బ‌య‌లుదేరి వ‌చ్చేసారు. కేంద్ర మంత్రి అమిత్ షాను వెంట‌నే దాడి జ‌రిగిన ప్ర‌దేశానికి పంపించి సెక్యూరిటీ రివ్యూ చేయాల‌ని ఆదేశించారు. 

ఏప్రిల్ 23

23న భార‌త్ దాడి గురించి తొలి కామెంట్ చేసింది. వెంట‌నే పాకిస్థాన్‌కు సింధు జ‌లాల‌ను ఆపేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. దీనినే మ‌నం ఇండ‌స్ వాట‌ర్ ట్రీటీ అని పిలుస్తాం. అట్టారీ వాఘా బోర్డ‌ర్‌ను మూసేసింది. భార‌త్‌లో ప‌లు కార‌ణాల వ‌ల్ల నివ‌సిస్తున్న పాకిస్థానీయుల వీసాల‌ను వెంట‌నే ర‌ద్దు చేసి భార‌త్‌ను వీడాల‌ని అల్టిమేటం విధించింది. ఇక్క‌డ నుంచి ప‌నిచేస్తున్న పాక్ దౌత్యాధికారుల సర్వీసుల‌ను ర‌ద్దు చేసి వెళ్లిపోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. చెప్పిన టైంకి వెళ్ల‌క‌పోతే మూడేళ్లు జైలు శిక్ష‌తో పాటు రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు జరిమానా క‌ట్టాల‌ని చెప్పింది. (Operation Sindoor Planning)

ఏప్రిల్ 24

ఇదే రోజున ప్ర‌ధాని నరేంద్ర మోదీ దాడిపై నోరువిప్పారు. దాడికి కార‌ణ‌మైన ప్ర‌తి ఒక్క ఉగ్ర‌వాదిని వెతికి మ‌రీ క‌ల్లో కూడా ఊహించ‌ని విధంగా శిక్షిస్తామ‌ని హామీ ఇచ్చారు. సాధార‌ణంగా ఆయ‌న హిందీలోనే మాట్లాడతారు. ఆంగ్లంలో చాలా త‌క్కువ‌. కానీ ఈ రివెంజ్ గురించి మాట్లాడుతూ మాత్రం మోదీ ఇంగ్లీష్‌లో కూడా వార్నింగ్ ఇవ్వ‌డం హైలైట్‌గా నిలిచింది.

ఏప్రిల్ 25

ఇదే రోజున ఆల్ పార్టీ మీటింగ్ జ‌రిగింది. దాదాపు 15 రాజ‌కీయ పార్టీ పెద్ద‌ల‌తో క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. దాడి గురించి రివెంజ్ గురించి అంద‌రి నుంచి స‌ల‌హాలు తీసుకున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత అయిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేలు కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా 100 శాతం స‌పోర్ట్ చేస్తామ‌ని మ‌ద్ద‌తు ఇచ్చారు.

ఏప్రిల్ 29

మోదీ ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన కీల‌క నేత‌ల‌ను క‌లిసారు. వారిలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ‌నాథ్ సింగ్, జ‌న‌ర‌ల్ అనిల్ చౌహాన్, భార‌త త్రివిధ ద‌ళాల చీఫ్స్ స‌మావేశంలో పాల్గొన్నారు. త్రివిధ ద‌ళాల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  (Operation Sindoor Planning)

మే 5

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యుద్ధానికి సంబంధించిన డ్రిల్స్ చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. ఎయిర్ రైడ్ సైరెన్లు, బ్లాక‌వుట్స్, ఎవాక్యువేష‌న్ ఎక్స‌ర్‌సైజులు నిర్వ‌హించాల‌ని చెప్పింది.

మే 6

ఈ రోజున UN సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జ‌రిగింది. పాకిస్థాన్ రిక్వెస్ట్ ప్ర‌కారం ద్వారాల‌న్నీ మూసేసి ర‌హ‌స్యంగా చ‌ర్చ‌లు జ‌రిగేలా చూసారు. ఈ స‌మావేశంలో ప‌హ‌ల్గాం దాడిని ఖండిస్తూ.. పాక్ చెప్పిన త‌ప్పుడు స‌మాచారాన్ని UN కౌన్సిల్ న‌మ్మ‌లేదు. ఈ స‌మావేశం త‌ర్వాత మాక్ డ్రిల్స్ గురించే ఎక్కువ‌గా వార్త‌లు వ‌స్తుండ‌డంతో పాక్ కూడా డ్రిల్స్ గురించే ఆలోచిస్తూ కూర్చుంది. పాక్‌కి అంత తెలివి ఎక్క‌డిది. అందుకే డ్రిల్స్ పేరుతో ఆర్మీ నేరుగా ఎటాక్ చేయాల‌ని నిర్ణయించింది.

మే 7

అంటే ఈరోజు. ఉద‌యం 1:45 గంట‌ల స‌మ‌యంలో పాక్‌లో కాస్త ముందుగానే దీపావ‌ళి వ‌చ్చేసింది. ఎంటా శ‌బ్దాలు అనుకుని క‌ళ్లు తెరిచి చూసేసరికి మెరుపు దాడులు, ద‌ట్ట‌మైన పొగ‌లు.. చుట్టూ విధ్వంసం. భార‌త్ కాల్చి వాత పెట్టింద‌ని పాక్‌కి అప్పుడు అర్థమైంది. అలా మోదీ, రాజ్‌నాథ్ సింగ్ .. ఆర్మీతో క‌లిసి సైలెంట్‌గా పాక్‌ను వెర్రి వెంగ‌ళ‌ప్ప‌ను చేసార‌న్న‌మాట‌.

ప్ర‌తీకార‌మా? రండి చూసుకుందాం

అప‌రేష‌న్ సింధూర్ అనంత‌రం.. పాక్ వ‌ణికిపోతూ దొంగ‌చాటుగా దెబ్బ‌తీసారు.. మేం కూడా చెప్ప‌కుండా ఎక్క‌డ దాడి చేయాలో అక్క‌డ చేస్తామంటూ హెచ్చ‌రిస్తోంది. ఇక్క‌డితో ఈ విష‌యానికి ముగింపు ప‌ల‌క్క‌పోతే త‌ర్వాత జ‌రిగేది యుద్ధ‌మే అని ఆర్మీ కూడా ప్ర‌క‌టించింది. కాదు కూడ‌దు అని పాక్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే భార‌త్ దానిని ధీటుగా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉంద‌ని కూడా స్ప‌ష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *