Bilawal Bhutto: ర‌క్తం పారుత‌ది అంటివి క‌దరా.. ఇప్పుడు మాట‌రావ‌డం లేదే

Bilawal Bhutto: పాకిస్థాన్‌కి చెందిన ఉగ్ర‌వాదులు జ‌మ్మూ కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో ప‌ర్య‌టిస్తున్న భార‌తీయ ప‌ర్యాట‌కుల‌పై భీక‌ర దాడి చేయ‌డంతో భార‌త్ ఎట్ట‌కేల‌కు ఈరోజు ప్ర‌తీకారం తీర్చుకుంది. పాక్‌లోని ఉగ్ర శిబిరాల‌పై మెరుపు దాడులు చేసి దాదాపు 60 మంది ఉగ్ర‌మూక‌ల‌ను మ‌ట్టుబెట్టింది. ప‌హ‌ల్గాం దాడి నేప‌థ్యంలో భార‌త్ తొలి ప్రతీకార చ‌ర్య‌గా ఇండ‌స్ వాట‌ర్ ట్రీటీని నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అంటే సింధూ జ‌లాలు పాక్‌కి వెళ్ల‌కుండా ఆప‌డం.

ఈ నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత పాకిస్థాన్ నేత బిలావ‌ల్ భుట్టో ఓ కూత కూసాడు. ఇండ‌స్ మ‌న‌ది. ఎప్ప‌టికీ మ‌న‌దే. ఇండ‌స్‌లో సింధు నీళ్లు పార‌క‌పోతే భార‌తీయుల ర‌క్తం పారుతుంది అని వాగాడు. ఇప్పుడు ఆప‌రేష‌న్ సింధూర్‌తో మ‌న బ‌ల‌మేంటో మ‌రోసారి పాక్ రుచి చూసింది. దాంతో బిలావ‌ల్ నోటి నుంచి మాట రావ‌డం లేదు. ఆనాడేమో నోటికొచ్చిన‌ట్లు ర‌క్తం పారుతుంది అని వాగినోడు.. ఈరోజు ఎందుకు ఈ యుద్ధాలు. దాయాది దేశాలు కూర్చుని ప్ర‌శాంతంగా చ‌ర్చించుకుంటే అన్నింటికీ ప‌రిష్కారం దొరుకుతుంది క‌దా అంటున్నాడు. ఇక్క‌డే అర్థ‌మైపోయింది క‌దా.. మ‌న భార‌త ఆర్మీ ఏ రేంజ్‌లో పాక్‌కి చెమ‌లు ప‌ట్టించిందో. భార‌తీయుల ర‌క్తం పారుతుంది అనే కామెంట్‌పై కూడా స్పందించాడు. అది కేవ‌లం త‌న‌లో ఉన్న ఆక్రోశం వ‌ల్ల వ‌చ్చిన మాట కాద‌ని.. పాకిస్థాన్ ప్ర‌జ‌ల బాధ‌ను అలా వెల్ల‌డించాన‌ని సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *