Virat Kohli: ఇంగ్లాండ్ సిరీస్‌లో కింగ్‌ని మ్యాచ్ చేసేదెవ‌రు?

Virat Kohli: కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. జూన్‌లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్తాడ‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. కోహ్లీ ఎప్పుడో బీసీసీఐకి ఈ నిర్ణ‌యం ప్ర‌క‌టించేసార‌ని… కానీ ప్ర‌పంచానికి మాత్రం ఈరోజు తెలియ‌జేసాడ‌ని అంటున్నారు.

మరోప‌క్క కోహ్లీ నిర్ణ‌యం వెనుక బీసీసీఐ ఉంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. స‌రే.. మంచో చెడో కోహ్లీ త‌న నిర్ణ‌యం తాను తీసేసుకున్నాడు. ఇప్పుడు ఎవ్వ‌రు చెప్పినా త‌న నిర్ణ‌యాన్ని మార్చుకోడు. మ‌రి జూన్‌లో జ‌ర‌గ‌నున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో కింగ్‌ని మ్యాచ్ చేసే స‌త్తా ఏ ఆటగాడికి ఉందంటారు? మ‌న‌కు కింగ్ ఔరాని మ్యాచ్ చేస్తే స‌త్తా ఐదుగురు క్రికెటర్ల‌లో కనిపిస్తోంది. వారెవ‌రంటే..

స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (Sarfaraz Khan)

డొమెస్టిక్ రెడ్ బాల్ క్రికెట్‌లో స‌ర్ఫ‌రాజ్‌కు మంచి ప‌ట్టుంది.

2024లో న్యూజిల్యాండ్‌పై సెంచ‌రీ బాదాడు.

ఇప్పుడు టెస్ట్ క్రికెట్‌లో మిడిలార్డ‌ర్‌లో ఆ స్థిర‌త్వం తేగ‌ల‌డు అనే న‌మ్మ‌క‌మైతే ఉంది.

కేఎల్ రాహుల్ (KL Rahul)

అద్భుత‌మైన బ్యాట‌ర్. ఓపెనింగ్ నుంచి నెంబ‌ర్ 6 వ‌ర‌కు ఎన్నో పొజిష‌న్స్‌లో ఆడి త‌న స‌త్తా నిరూపించుకున్నాడు.

త‌న‌కున్న అనుభ‌వంతో నెంబ‌ర్ 4లోనూ ఆడ‌గ‌ల‌డు.

ఒత్తిడిగా అనిపించే సంద‌ర్భాల్లోనూ నిల‌దొక్కుకోగ‌ల‌డు.

ర‌జ‌త్ పాటిదార్ (Rajat Patidar)

ర‌జ‌త్‌పై అన్ని అంచ‌నాలు పెట్టుకోలేక‌పోయినా డొమెస్టిక్ క్రికెట్‌లో మాత్రం మ‌నోడు అద‌ర‌గొడ‌తాడు.

స్పిన్‌ని బాగా ఎదుర్కోగ‌ల‌డు. IPL నుంచి నేర్చుకున్న అనుభ‌వం కూడా ఉంది.

మిడిలార్డ‌ర్‌లో ర‌జ‌త్‌ను లాంగ్ ట‌ర్మ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌గా చూడ‌చ్చు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer)

డొమెస్టిక్, ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో త‌న ట్యాలెంట్ నిరూపించుకున్నాడు. మంచి క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు.

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో అద‌ర‌గొట్టి మ‌ళ్లీ BCCI సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ల‌ను ద‌క్కించుకున్నాడు.

ఎటాకింగ్ స్టైల్ బాగుంది కాబ‌ట్టి నెంబ‌ర్ 4 పొజిష‌న్ ద‌క్కించుకునే ఛాన్స్ ఉంది.

సాయి సుద‌ర్శ‌న్ (Sai Sudharsan)

ఆట ప‌ట్ల స్థిరత్వం ఉన్న ఆట‌గాడ‌ని ఈ IPL సీజ‌న్‌లో నిరూపించుకున్నాడు.

ఓపెన‌ర్ అయిన‌ప్ప‌టికీ నెంబ‌ర్ 4 పొజిష‌న్ ఇచ్చే సూచ‌న‌లు లేక‌పోలేదు.

రైజింగ్ స్టార్‌గా ప‌రిగ‌ణించి టెస్ట్ క్రికెట్‌లో అవ‌కాశం ఇస్తే క‌చ్చితంగా నిరూపించుకుంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *