War 2: సినిమాలో ఆ పేరే లేదు

War 2: బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న వార్ 2 సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మెయిన్ పాత్ర‌లో హృతిక్ రోష‌న్ న‌టిస్తున్నాడు. అయితే.. ప్ర‌స్తుతం దేశంలో జరుగుతున్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో యుద్ధం, ఫైటింగ్‌ల‌కు సంబంధించిన సినిమాల్లో పాకిస్థాన్ పేరును వాడేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ YRF ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. తామ నిర్మాణ సంస్థ నుంచి వ‌స్తున్న వార్ 2, ఆల్ఫా సినిమాల్లో ఎక్క‌డా కూడా పాకిస్థాన్ అనే పేరును వాడ‌లేద‌ని.. కాబ‌ట్టి త‌మ స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *