Virat Retirement: BCCI వెన్నుపోటు

Virat Retirement: విరాట్ కోహ్లీని BCCI వెన్నుపోటు పొడిచిందా? ఇంకో నెల‌లో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఉంద‌న‌గా విరాట్ ఇప్పుడే ఎందుకు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లు? దీనికి కార‌ణం BCCI అని ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అస‌లేం జ‌రిగిందంటే.. అడిలైట్ టెస్ట్ త‌ర్వాత‌ విరాట్‌కి బీసీసీఐ ఓ మాటిచ్చింద‌ట. టెస్ట్ క్రికెట్‌లో మ‌ళ్లీ కెప్టెన్‌ని చేస్తాం అని. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ స‌మ‌యంలో బీసీసీఐ ఈ మాటిచ్చింద‌ట‌.

కానీ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో టీమిండియా బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఓడిపోయింది. ఈ ట్రోఫీ త‌ర్వాత బీసీసీఐ టెస్ట్ కెప్టెన్సీ ఊసే ఎత్త‌లేదు. కోహ్లీకి అత్యంత స‌న్నిహితుడైన మాజీ సెలెక్ట‌ర్ శ‌ర‌ణ్‌దీప్ సింగ్ కూడా ఇదే చెప్పారు. తన‌కు కోహ్లీ చాలా క్లోజ్ అని.. అలాంటిది త‌న‌తో రిటైర్మెంట్ గురించి ఒక్క మాట కూడా చెప్ప‌ని కోహ్లీ ఉన్న‌ట్టుండి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడంటే ఏదో తేడా కొడుతోంద‌ని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *