Prabhas ఇప్పటివరకు తాను చేసిన సినిమాల నుంచి రిలీజ్ అయిన బెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఏదైనా ఉందంటే అది స్పిరిట్ సినిమాదే అని అన్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గాయాలతో షర్ట్ తీసేసి ఉన్న ప్రభాస్‌కు హీరోయిన్ తృప్తి డిమ్రి సిగరెట్ వెలిగిస్తున్నట్లుగా ఉన్న ఆ లుక్ చూసి ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. దీనిపై ప్రభాస్ స్పందిస్తూ.. ఇదే తన సినీ కెరీర్లో బెస్ట్ కల్ట్ పోస్టర్ అని అన్నారు. పోస్టర్లో ప్రభాస్ ఒక లీటర్ బాటిల్ పట్టుకుని ఉంటే.. అది ఆయన చేతిలో ఒక గ్లాస్‌లా కనిపిస్తోందని అందుకే ఆయన్ను ఆజానుబాహుడు అన్నానని సందీప్ రెడ్డి వంగా చమత్కరించారు.