Divya Spandana దేశంలోని మగాళ్లందరినీ జైల్లో పడేయాలని డిమాండ్ చేస్తున్నారు నటి, బీజేపీ నేత దివ్య స్పందన. వీధి కుక్కల నిర్మూలన విషయంలో మూడు రోజులుగా సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ న్యాయమూర్తి స్పందిస్తూ.. వీధి కుక్కల మైండ్ సెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదని.. అవి ఎప్పుడు కరుస్తాయో మనం ఊహించలేమని అన్నారు. దీనిపై దివ్య స్పందన స్పందిస్తూ.. మగవాళ్ల మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందో తెలీదని.. ఎప్పుడు రేప్ చేస్తాడో చెప్పలేం కాబట్టి ఆడవాళ్ల సంరక్షణ కోసం మగాళ్లందరినీ అరెస్ట్ చేసి జైల్లో పడేయాల్సిందేనని అన్నారు.