జ‌గ‌న్‌ని అన్నారు.. ఇప్పుడేం చేస్తాడు మీ నాయ‌కుడు?

Varadharajulu Reddy: అధికారం ఎప్ప‌టికీ చంద్ర‌బాబు నాయుడుకే శాశ్వ‌తం కాదు.. మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి.. ఈసారి అధికారంలోకి వ‌చ్చేది మేమే.. అప్పుడు ఈ పోలీసుల బ‌ట్ట‌లూడ‌దీసి రోడ్డు మీద నిల‌బెడ‌తాం.. ఇటీవ‌ల వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు. ఈ వ్యాఖ్య‌లు ఎంత దుమారం రేపాయో తెలిసిందే.

ఆ త‌ర్వాత రామగిరి ఎస్.ఐ జి. సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు కాదు ఇవి.. కష్టపడి పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫాం అని బదులిచ్చారు. అయితే.. ఇప్పుడు ఏకంగా తెలుగు దేశం పార్టీకి చెందిన నేతే పోలీస్ శాఖ‌పై షాకింగ్ ఆరోప‌ణ‌లు చేసారు.

నీతిగా, నిజాయితీగా బాగా కష్టపడి ఉద్యోగం సంపాదించి.. అవినీతితో డబ్బులు సంపాదించే పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేసారు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి. పోలీస్‌ శాఖలో అన్ని స్థాయిల్లో అవినీతి ఉందని.. మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగంలో చేరింది అక్రమార్జన కోసమా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మ‌రి ఈయ‌న‌పై ఏ పోలీస్ అధికారైనా మాట్లాడ‌గ‌ల‌రా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *