ఛీ.. “పాడు”తా తీయ‌గా

Padutha Theeyaga: ప్ర‌ముఖ సింగింగ్ రియాల్టీ షో పాడుతా తీయ‌గాకు మంచి పేరుంది. ఇది ఇప్ప‌టి ప్రోగ్రాం కాదు. దాదాపు 30 సంవ‌త్స‌రాలుగా ప్ర‌సారం అవుతోంది. అయితే.. ఇప్పుడు ఈ షో గురించి షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని ఎలిమినేట్ అయిన సింగ‌ర్ ప్ర‌వ‌స్తి సంచ‌ల‌న ఆరోప‌ణాలు చేస్తోంది. ఈ షోకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీతలు జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరిద్ద‌రూ ప్ర‌వ‌స్తి ప‌ట్ల త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించారు.

బాడీ షేమింగ్ చేస్తూ త‌న‌ను వెక్కిరించార‌ని ప్ర‌వ‌స్తి వీడియో బ‌య‌ట‌పెట్టింది. ఆ అమ్మాయి ఓ పెళ్లిలో పాట పాడితే చాలా అసహ్యంగా మాట్లాడారని పెళ్లిలో పాటలు పాడేవాళ్లు అసలు సింగర్స్ కాదు అంటూ అవమానించారని బాధ‌పడింది. త‌న‌ను ఒక‌ చీడ పురుగు లాగా చూసే వాళ్ళని ప్రొడక్షన్ వాళ్ళు చీర బొడ్డికిందకి కొట్టుకోవాలని, ఎక్స్‌పోజింగ్ చేయాలని ఫోర్స్ చేసే వాళ్ళంటూ ప్ర‌వ‌స్తి వాపోయింది. అంతేకానీ.. ఈ షోలో కేవ‌లం ఒక కులానికి చెందిన‌వారినే ప్రోత్స‌హిస్తున్నార‌ని అంటోంది. ఇంకా దీనిపై పాడుతా తీయ‌గా టీం కానీ కీర‌వాణి, సునీత‌లు కానీ స్పందించ‌లేదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *