Mahbubnagar: మహబూబ్నగర్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆస్తి ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు పట్టుబట్టి కూర్చోవడంతో.. ఆ పని కూతురు చేయాల్సి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన తండ్రి మాణిక్య రావు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. తనకు కోటి రూపాయల ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తండ్రికి తలకొరివి పెడతానని కొడుకు గొడవ పెట్టడంతో అంత్యక్రియల ప్రక్రియ కొద్ది సేపటి వరకు ఆగిపోయింది. దాంతో నా తండ్రికి నేను తలకొరివి పెడతాను అంటూ చిన్న కూతురు ముందుకు రావడంతో.. ఆ తతంగాన్ని ఆమెతోనే జరిపించాల్సి వచ్చింది.