Shruti Haasan: ఎన్నో బాయ్‌ఫ్రెండ్ అని అడుగుతున్నారు

Shruti Haasan: శృతి హాస‌న్ సినిమాల కంటే ఆమె ల‌వ్ లైఫ్ గురించే జ‌నాల‌కు ఎంతో ఆసక్తి ఉంటుంది. అఫ్‌కోర్స్ అది స‌హ‌జం అనుకోండి. శృతి హాస‌న్ విష‌యంలో ఇది ఇంకాస్త క్యూరియాసిటీని పెంచుతుంది. ఎందుకంటే శృతి హాస‌న్ ఒక్కో సంద‌ర్భంలో ఒక్కో అబ్బాయితో క‌నిపించేవారు. పైగా ఆమె త‌న రిలేష‌న్‌షిప్స్ గురించి గోప్యంగా ఉంచ‌డాలు లాంటివి కూడా చేయ‌రు. అన్నీ నిర్మొహ‌మాటంగా ఒప్పేసుకుంటారు.

కానీ పాపం ఆవిడ‌కి అంత మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్న‌ప్ప‌టికీ ఎవ్వ‌రితోనూ స‌రిగ్గా క‌నెక్ట్ అవ్వ‌లేక‌పోయారు. అంటే.. వాళ్ల‌ల్లో ఏ ఒక్క‌రూ జీవితాంతం తోడుగా ఉంటాన‌న్న భ‌రోసా, న‌మ్మ‌కం క‌ల్పించ‌లేక‌పోయార‌ట. ఈ ఒక్క విష‌యంలోనే త‌న‌కు కాస్త బాధ‌గా ఉంటుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికీ చాలా మంది స్నేహితులు తాను ఎవ‌రైనా అబ్బాయితో క‌నిపిస్తే ఎన్నో బాయ్‌ఫ్రెండ్ ఇత‌ను అని మొహం మీదే అడిగేస్తుంటార‌ట‌. కానీ తానేమీ బాధ‌ప‌డ‌న‌ని శృతి అంటున్నారు. తెలుగులో స‌లార్ పార్ట్ 1లో సంద‌డి చేసిన శృతి.. ఇప్పుడు కూలీ అనే త‌మిళ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో ర‌జినీకాంత్, నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *