Paresh Rawal: గోమూత్రం బీర్ తాగిన‌ట్లు తాగేవాడ్ని.. ఏంటి లింగంమాయ్యా ఇది?

Paresh Rawal: భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌తం అనే సిద్ధాంతంపై న‌డుస్తోంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. సరే ఎవ‌రి ఇష్టం వారిది అనుకోండి. అయితే ఎంత భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఉన్నంత మాత్రాన చ‌దువుకున్న వారు కూడా లాజిక్ లేకుండా మాట్లాడితే బాగోదు. శంక‌ర్ దాదా ఎంబీబీఎస్‌లో డాక్ట‌ర్ లింగం క్యారెక్ట‌ర్‌లో ప‌రేష్ రావ‌ల్ తెలుగు వారికి సుప‌రిచితుల‌య్యారు. ఎన్నో హిందీ సినిమాలు చేసి అక్క‌డా త‌న స‌త్తా చాటుకున్నారు. ఇప్పుడు ప‌రేష్ భార‌తీయ జ‌నతా పార్టీలో ఉన్నారు. అయితే.. ఆయ‌న ఇటీవ‌ల చేసిన వ్యాఖ్య‌లు కాస్త వివాదాస్ప‌దం అయ్యాయి.

ఓసారి ముంబైలోని చేప‌ల మార్కెట్‌లో షూటింగ్ చేస్తుండ‌గా ఆయన మోకాలిని గాయం అయ్యింద‌ట‌. హాస్పిట‌ల్లో జాయిన్ చేస్తే ఎముక అత‌క‌డానికి రెండున్న‌ర నెల‌లు ప‌ట్ట‌చ్చు అని వైద్యులు అన్నార‌ట‌. అదే స‌మ‌యంలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ తండ్రి వీరూ దేవ‌గ‌ణ్ ప‌రేష్‌ను ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్లారు. అప్పుడు ఆయ‌న గోమూత్రం తాగుతూ మ‌ద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటే త్వ‌ర‌గా న‌యం అవుతుంద‌ని చెప్పార‌ట‌. ఆయ‌న చెప్పారు క‌దా అని ప‌రేష్ గోమూత్రాన్ని బీర్ తాగిన‌ట్లు కొంచెం కొంచెం తాగేవార‌ట‌. అలా రెండున్న‌ర నెల‌ల్లో అత‌కాల్సిన కాలు నెల రోజుల్లోనే అతికేసింద‌ట‌. అది చూసి డాక్ట‌ర్లు కూడా షాకైన‌ట్లు ప‌రేష్ తెలిపారు. ఈయ‌న కామెంట్స్ విని నెటిజ‌న్లు షాక్ అయ్యారు. గోమూత్రం తాగితే ఇక వైద్యం ఎందుకు వైద్య చ‌దువులు ఎందుకు అని తిట్టిపోస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *