Pawan Kalyan: ఎట్టకేలకు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. రాజకీయాల్లో బిజీగా ఉంటున్న ఆయనకు షూటింగ్ పూర్తి చేసే తీరిక లేకుండా పోయింది. దాంతో దర్శకులు, నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. వారి బాధను అర్థం చేసుకున్న పవన్ ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసేయాలని నిర్ణయించుకున్నారు. చాలా కాలం తర్వాత ఈరోజే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. మిగిలిన షూటింగ్ మొత్తం ఈరోజే చేసేసి వెళ్తా అని పవన్ నిర్మాతతో చెప్పారట. ఇక ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతానికైతే సినిమాకు అంత హైప్ లేదు. టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ అయితేనే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పగలం.