Pakistan: సింధూ జ‌లాల నిలిపివేత‌.. భార‌త వాసికి పాక్ ఎద‌వ‌ల టార్చ‌ర్

Pakistan: జ‌మ్మూ కాశ్మీర్‌లోని ప‌హ‌ల్గాంలో ఉగ్ర దాడి జ‌రిగిన నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం పాకిస్థాన్‌కు వెళ్లాల్సిన సింధూ జ‌లాల‌ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. దాంతో ప్ర‌స్తుతం చాలా మంది పాకిస్థానీయుల‌కు నీళ్లు స‌రిపోక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఈ విష‌యంలో పాక్ కాళ్ల బేరానికి వ‌చ్చింది. కానీ మ‌నం మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఈ నేప‌థ్యంలో దుబాయ్‌లో ఉంటున్న పాకిస్థానీయులు మ‌న భార‌త వాసి ప‌ట్ల దారుణంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది.

ఉత్త‌రాఖండ్‌లోని కిచ్చా ప్రాంతానికి చెందిన విశాల్ ఓ ఏజెంట్ ద్వారా ప‌నిచేసుకునేందుకు దుబాయ్ వెళ్లాడు. సంవ‌త్స‌రం నుంచి అక్క‌డే ప‌నిచేస్తున్నాడు. అయితే విశాల్ ప‌ని చేస్తున్న చోట ఎక్కువ‌గా పాకిస్థానీయులు స‌హ‌చ‌రులుగా ఉన్నారు. ఎప్పుడైతే భార‌త్ సింధూ జ‌లాల‌ను నిలిపివేసిందో అప్ప‌టి నుంచి ఆ పాక్ ఎద‌వ‌లు విశాల్‌ను టార్చ‌ర్ చేయ‌డం మొద‌లుపెట్టారట‌. మాకు నీళ్లు ఆపేసారు కాబ‌ట్టి నీకు కూడా నీళ్లు ఇవ్వం. దాహంతో చావు అని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడార‌ట‌.

స‌రైన తిండి, నీరు లేక విశాల్ అనారోగ్యానికి గుర‌వుతుండ‌డంతో వెంట‌నే ఇంట్లో వారికి చెప్పాడు. వాళ్లు విశాల్‌ను భార‌త్ ర‌ప్పించేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం లేకుండా పోయింది. దాంతో విశాల్ త‌ల్లిదండ్రులు స్థానిక పోలీసుల‌ను ఆశ్ర‌యించి విష‌యం అంతా చెప్పారు. వారు వెంట‌నే ఫిర్యాదు తీసుకుని విశాల్‌ను దుబాయ్‌కి పంపిన ఏజెంట్‌ను ప‌ట్టుకుని అత‌ని ద్వారా వివ‌రాల‌న్నీ తీసుకున్నారు. అలా దుబాయ్‌లో ఉన్న ఇత‌ర భార‌తీయుల సాయంతో విశాల్‌కు టికెట్ ఇప్పించి నిన్న సుర‌క్షితంగా భార‌త్ చేరుకునేలా చేసారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *