Pahalgam Attack: ప‌హ‌ల్గాం భీకర దాడి.. నిందితుల్లో పాక్ క‌మాండో

Pahalgam Attack: ప‌హ‌ల్గాం భీకర దాడి.. నిందితుల్లో పాక్ క‌మాండో

Pahalgam Attack: జ‌మ్మూ క‌శ్మీర్‌లోని ప‌లహ్గాంలో జ‌రిగిన భీక‌ర దాడిలో 26 మంది భార‌తీయులు ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. దాడి చేసిన వారిలో ముగ్గురు ఉగ్ర‌వాదులు ఉన్నార‌ని భార‌త ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు గుర్తించాయి. వీరి పేర్లు హ‌ఫీజ్ స‌యీద్, హాషిమ్ మూసా, సైఫుల్లా క‌సూరి. హ‌ఫీజ్, సైఫుల్లాను ఇప్పుడు పాకిస్థాన్‌లో ఉన్నారు.

కానీ హాషిమ్ మాత్రం ద‌క్షిణ క‌శ్మీర్‌లో న‌క్కి ఉన్నాడ‌ని తెలిసింది. అత‌న్ని ప్రాణాల‌తో ప‌ట్టుకోవాల‌ని భార‌త ఆర్మీ అధికారులు 24 గంట‌లూ కూంబింగ్ చేప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఒక నిందితుడి గురించి కీల‌క అప్డేట్ వ‌చ్చింది. హ‌షీమ్ మూసా అనే వ్య‌క్తి ల‌ష్క‌రే తైబా సంస్థ‌లో చేర‌డానికి ముందు పాకిస్థాన్ స్పెష‌ల్ స‌ర్వీస్ గ్రూప్‌లో పారా కమాండోగా ప‌నిచేసాడ‌ట‌. ఆ త‌ర్వాత అత‌ను ఉగ్ర‌వాదిగా మారాడు. ఈ హ‌షిమ్ అనే వ్య‌క్తి 2023లోనే భార‌త్‌లో అడుగుపెట్టాడు.

అప్ప‌టి నుంచి భార‌త్‌పై ఎలా దాడులు చేయాలా అని స‌న్నాహాలు చేస్తున్నాడు. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో జ‌మ్మూ క‌శ్మీర్‌లోని గందేర్బాల్ జిల్లాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో హ‌షిమ్ కీలక సూత్ర‌ధారి. ఇప్పుడు ఇత‌న్ని ప్రాణాల‌తో ప‌ట్టుకుంటే పాక్‌కు స‌రైన గుణ‌పాఠం చెప్ప‌చ్చు. ఇప్ప‌టికే నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.20 ల‌క్ష‌ల రివార్డ్ ఇస్తామ‌ని భార‌త ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *