దీనికేం స‌మాధానం చెప్తారు?

Jagan గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై స్పందించారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్ కాంగ్రె పార్టీ అధినేత‌ జగన్ మోహ‌న్ రెడ్డి. రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు? పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? సాల్మాన్ హత్యపై మీరు ఏం సమాధానం చెబుతారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడడానికి సాల్మాన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేస్తారా అంటూ కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఫైర్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *