Virat Kohli Test Cricket: BCCI త‌ప్పుకోమందా?

Virat Kohli Test Cricket: స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఈరోజు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు ప్ర‌క‌టించి అభిమానులను ఉద్వేగానికి లోనయ్యేలా చేసాడు. అస‌లు కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు అప్పుడే వీడ్కోలు ప‌లుకుతాడ‌ని అనుకోలేదు. అయితే కోహ్లీది సొంతంగా తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని.. దీని వెనుక BCCI హ‌స్తం ఉంద‌నే టాక్ న‌డుస్తోంది.

తాను టెస్ట్ క్రికెట్‌కి వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాను అని కోహ్లీ బీసీసీఐకి లేఖ రాసిన‌ప్పుడు ఒక్క బోర్డు స‌భ్యుడు కూడా ఇంకోసారి ఆలోచించ‌వ‌చ్చు క‌దా కోహ్లీ అన‌లేద‌ట‌. పైగా నువ్వు టెస్ట్ క్రికెట్‌కు ఇప్పుడు ఫిట్‌గా లేవు.. త్వ‌ర‌లో ఇంగ్లాండ్‌లో ఐదు రోజుల టెస్ట్ సిరీస్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో నువ్వు ఇప్పుడే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే మంచిది అని కోహ్లీతో చెప్ప‌డంతో ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది.

ఇదే విష‌యం గురించి బీసీసీఐని అడ‌గ్గా.. ఏ క్రికెట‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా మేం స్వీక‌రిస్తాం. అంతేకానీ ప్లీజ్ ఉండ‌చ్చు క‌దా.. ఇంకొన్ని నెల‌లు ఆడ‌చ్చు క‌దా అని వేడుకోం. ఆ అవ‌స‌రం కూడా మాకు లేదు.. అని చెప్పార‌ట‌. కోహ్లీ విష‌యంలోనే కాదు.. రోహిత్ శ‌ర్మ విష‌యంలోనూ ఇదే జరిగింద‌ట‌. మే 7న BCCI మీటింగ్‌లో ఇక టెస్ట్ సిరీస్‌ల‌కు రోహిత్ స‌రిపోడు అని అంద‌రూ నిర్ణ‌యించుకోవ‌డంతో హిట్ మ్యాన్ కూడా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాల్సి వ‌చ్చింద‌ని రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *