Spirit: దీపిక‌తో గొడ‌వేంటి? ఎందుకు తొల‌గించారు?

Spirit: డైన‌మిక్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా.. రెబెల్ స్టార్ ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో స్పిరిట్ అనే సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ నుంచి షూటింగ్ మొద‌లుకానుంది. అయితే.. ఇందులో హీరోయిన్‌గా దీపిక ప‌దుకొణెను తీసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఆమెను సినిమా నుంచి తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఇందుకు ప‌లు కారణాలు వినిపిస్తున్నాయి. దీపిక కొన్ని నెల‌ల క్రితం ఆడ‌పిల్ల‌కు జ‌న్మనిచ్చిన సంగ‌తి తెలిసిందే. దాంతో ఆమె ఓ ర‌కంగా మెట‌ర్నిటీ సెలవుల్లో ఉంద‌నే చెప్పాలి.

దీపిక ఈ సినిమాలో న‌టించేందుకు చాలా ష‌ర‌తులే పెట్టింద‌ట‌. త‌న‌కు రోజులో 8 గంట‌ల ప‌ని మాత్రమే ఉండాల‌ని.. అంటే తాను షూటింగ్‌కి కేవ‌లం రోజులో 8 గంట‌లు మాత్ర‌మే కేటాయిస్తాన‌ని చెప్పింద‌ట‌. త‌న‌కు పాప ఉంది కాబ‌ట్టి సందీప్ రెడ్డి వంగా కూడా ఈ ష‌ర‌తుకు ఒప్పుకున్నారు. అయితే.. ఆ 8 గంట‌ల స‌మ‌యంలో కేవ‌లం 6 గంట‌లు మాత్ర‌మే వినియోగించుకోగలిగార‌ట‌. సినిమా కోసం ఏకంగా రూ.20 కోట్ల పారితోషికం అడిగిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. సినిమా ప్రాఫిట్స్‌లో షేర్ కూడా ఆశించిన‌ట్లు తెలుస్తోంది.

ఇక సినిమాలో త‌న డైలాగులు తెలుగులో మాత్రం చెప్ప‌ను అంద‌ట‌. ఇన్ని ష‌ర‌తులు పెట్టేస‌రికి సందీప్ రెడ్డి వంగాకి ఒళ్లు మండింది. దీని కంటే ఆమెతో సినిమా చేయ‌క‌పోవ‌డ‌మే న‌యం అనుకున్న సందీప్ ఆమెను కాకుండా వేరే హీరోయిన్‌ను పెట్టుకుని తీస్తే బెట‌ర్ అని నిర్మాత‌తో చెప్ప‌డంతో దీపిక‌ను సినిమా నుంచి తొల‌గించార‌ట‌. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *