Lakshmi: ల‌క్ష్మీ దేవి అంద‌రి దగ్గ‌ర ఎందుకు ఉండ‌దు?

Lakshmi: మ‌న భార‌త‌దేశంలో దాదాపు 99 శాతం హిందువుల ఇళ్ల‌ల్లో ల‌క్ష్మీ దేవి ఫోటోలు, విగ్ర‌హాలు ఉంటాయి. రోజూ ల‌క్ష్మీదేవిని పూజిస్తుంటారు. కానీ ల‌క్ష్మి మాత్రం కొంద‌రి ద‌గ్గ‌రే ఉంటుంది. ఎందుక‌లా? దీనికి ఒక కార‌ణం ఉంది. ఇక్క‌డ మ‌నం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. డ‌బ్బు అనేది ఎప్పుడూ కూడా క‌రిమింగిన వెల‌గ‌పండు లాగా క‌రిగిపోతుంటుంద‌ట‌.

అదే డ‌బ్బు రావాల‌నుకుంటే మాత్రం కొబ్బ‌రి కాయ‌లోకి నీళ్లు ఎలా వ‌స్తాయో అలా వస్తుంది. నిజానికి మనం ఎంత సంపాదించాలి అనేది రాసిపెట్టేసి ఉంటుంద‌ట‌.  దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే.. మ‌న‌కు ఏకాద‌శి ఉప‌వాస విశిష్టత గురించి తెలియాలి. ఒక మ‌నిషి ఎంత అన్నం తినాలో.. ఆ తినే ప్ర‌తి బియ్యం గింజ మీద వాడి పేరు ఉంటుంద‌ని అంటారు. ల‌క్ష్మికి కూడా అదే వ‌ర్తిస్తుంది. అంటే.. మ‌న ద‌గ్గ‌ర ఎంతుండాలో అంతే ఉంటుంది. ఏకాద‌శి రోజున ఒక వ్య‌క్తి ఉప‌వాసం ఉండి.. ఆ రోజు వండుకోకుండా దాచిన బియ్యం మిగిలిపోయి..  మ‌రుస‌టి రోజు దాన్ని వండుకుని తింటున్నాడు అంటే.. ఆ రోజుకి వాడు ఏమీ తిన‌క‌పోయినా ఆ మ‌రుస‌టి రోజు తినాల‌ని రాసి పెట్టి ఉంది అని అర్థ‌మ‌ట‌. అందుకే ల‌క్ష్మీదేవి ఎవ‌రి వ‌ద్ద ఎంత వ‌ర‌కు ఉండాలో.. ఎంత‌టి స్థాయిలో ఉండాలో.. అంత‌టి స్థాయిలోనే ఉంటుంద‌ట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *