Manchu Vishnu: ప్ర‌భాస్ నాకోసం నిల‌బ‌డ్డాడు… త‌న రుణం తీర్చుకోలేను

Manchu Vishnu: మంచు విష్ణు న‌టించిన క‌న్న‌ప్ప జూన్ 27న రిలీజ్ కాబోతోంది. భారీ బ‌డ్జెట్‌తో మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు. దాంతో ఇప్ప‌టి నుంచే ప్ర‌మోష‌న్స్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలో విష్ణు ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ప్ర‌భాస్‌తో త‌న‌కున్న బంధం గురించి వివ‌రించారు. సొంత‌వాళ్లు, ర‌క్తం పంచుకుపుట్టిన వాళ్లే త‌న నాశ‌నాన్ని కోరుకుంటే ఎలాంటి సంబంధం లేని ప్ర‌భాస్ మాత్రం త‌న‌ను ఓ హీరోలా చూడాల‌ని కోరుకున్నాడ‌ని అన్నారు.

ప్ర‌భాస్ ప్ర‌తిసారి త‌న‌కోసం నిల‌బ‌డ్డాడ‌ని.. అందుకు ఎప్ప‌టికీ త‌న‌కు రుణ ప‌డి ఉంటాన‌ని అన్నారు. ప్ర‌భాస్ భార‌త‌దేశంలోనే ఓ పెద్ద స్టార్ అన్న సంగ‌తి కూడా ఆయ‌న‌కు తెలీద‌ని.. అంత సింపుల్ వ్య‌క్త‌ని తెలిపారు. త‌న‌పై ప్ర‌భాస్‌కి న‌మ్మ‌కం ఉంది కాబ‌ట్టే క‌న్న‌ప్ప సినిమాలో ఓ పాత్ర‌లో న‌టించాల‌ని అడ‌గ్గానే ఆయ‌న ఒప్పుకున్నార‌ని ఇలాంటి స్నేహితుడు ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉండాల్సిందేన‌ని కొనియాడారు.

కొంత‌కాలంగా త‌న కుటుంబంలో జ‌రుగుతున్న స‌మ‌స్య‌ల గురించి విష్ణు మాట్లాడుతూ భావోద్వేగానికి లోన‌య్యారు. త‌న‌కు జీవితంలో త‌న తండ్రి మోహ‌న్ బాబుకి మంచిన వారు ఎవ్వ‌రూ లేర‌ని.. త‌న తండ్రి సంతోష‌మే త‌న‌కు ముఖ్య‌మని అన్నారు. ఆయ‌న సంతోషంగా ఉండ‌టానికి ఏదైనా చేస్తాన‌ని ఆయన సంతోషంగా లేని నాడు ప్ర‌పంచం ఎటు పోయినా తాను ప‌ట్టించుకోన‌ని తెలిపారు. ఆయ‌న త‌ల‌వంచుకునే ప‌ని తాను ఎప్ప‌టికీ చేయ‌న‌ని.. త‌న వ‌ల్ల త‌న తండ్రి త‌లదించుకునే ప‌రిస్థితి వ‌స్తే మాత్రం తానొక శవంతో స‌మానమంటూ ఉద్వేగానికి లోన‌య్యారు. (Manchu Vishnu)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *