RCB Virat Kohli: ఏయ్‌.. ఆ పాట బంద్ చేయ్

RCB Virat Kohli: టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ఫ్యాన్స్‌కి గట్టి షాకిచ్చిన స్టార్ బ్యాట్స్‌మ‌న్ విరాట్ కోహ్లీ.. ఇప్పుడు IPL కోసం మ‌ళ్లీ ప్రాక్టీసింగ్ మొద‌లుపెట్టాడు. భార‌త్, పాకిస్థాన్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో రెండు వారాల పాటు ఐపీఎల్‌ను స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క్రికెట‌ర్లకు కాస్త రెస్ట్ దొరికిన‌ట్లైంది. బీసీసీఐ తాజా షెడ్యూల్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఇక మ‌ళ్లీ ప్రాక్టీసింగ్ సెష‌న్లు మొద‌లుపెట్టారు.

ఈరోజు చిన్న‌స్వామి స్టేడియంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, క‌ల‌క‌త్తా నైట్ రైడర్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో నిన్న‌ విరాట్ ప్రాక్టీసింగ్‌కు వెళ్లాడు. ప్రాక్టీసింగ్‌లో విరాట్ అద్భుత‌మైన షాట్స్ బాదుతూ ప్రాక్టీస్ చేస్తున్నంత సేపు ఆర్సీబీ టైటిల్ సాంగ్‌ని ప్లే చేసార‌ట‌. దాదాపు అర‌గంట పాటు విరాట్ ప్రాక్టీస్ చేయ‌గా.. అంత సేపూ ఆ పాట‌ను ప్లే చేసార‌ట‌. దాంతో విరాట్‌కు ఒళ్లు మండిపోయింది. అక్క‌డున్న సిబ్బందిని పిలిచి ఏయ్‌.. ఆ పాట‌ను బంద్ చేయ‌మ‌ని చెప్పండి. ప్రాక్టీసింగ్ ప్ర‌శాంతంగా చేసుకోవాలా వ‌ద్దా అని గ‌ట్టిగా కేక‌లు వేసాడ‌ట‌. నిన్నంతా విరాట్ మూడ్ బాలేద‌ని అక్క‌డున్న సిబ్బంది మీడియా వ‌ర్గాల‌కు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *