Suresh Raina: ఈ సాల క‌ప్ ఆర్సీబీదే అనిపిస్తోంది

Suresh Raina: ఈ సాల క‌ప్ న‌మ్‌దే… ఇది జ‌స్ట్ ఒక డైలాగ్ కాదు.. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఇదొక ఎమోష‌న్. 18 ఏళ్లుగా ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఐపీఎల్ క‌ప్ గెలిచింది లేదు. అమ్మాయిల టీం క‌ప్ గెలిచింది కానీ ఇప్ప‌టివ‌ర‌కు అబ్బాయిలు మాత్రం కొట్ట‌లేక‌పోయారు. ఈ టార్చ‌ర్ త‌ట్టుకోలేకే విరాట్ కోహ్లీ కెప్టెన్సీని కూడా వ‌దులుకున్నాడు. అయితే.. ఈ ఏడాది మాత్రం బెంగ‌ళూరు మంచి ఫాంలో ఉంది. క‌ప్ కొట్టేసేలా ఉంద‌ని చాలా టీమ్స్ కూడా అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు ఈ ఏడాది తెర‌ప‌డ‌నుంద‌ని బెంగ‌ళూరు ఫ్యాన్స్ కూడా వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిన్న త‌ల అలియాస్ మాజీ క్రికెట‌ర్ సురేష్ రైనా ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసారు. చూడ‌బోతే ఈ సాల క‌ప్ ఆర్సీబీదే అనిపిస్తోంద‌ని అన్నారు. గ‌త లీగ్స్‌తో పోలిస్తే ఈసారి బెంగ‌ళూరు కాస్త రూటు మార్చింద‌ని.. బౌలింగ్‌లో కూడా మంచి మార్పులు వ‌చ్చాయ‌ని అన్నారు. ఇప్ప‌టికే బెంగ‌ళూరు కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ చెన్నైలో ఒక‌సారి.. సొంత గ‌డ్డ‌పై ఒక‌సారి చెన్నై సూప‌ర్ కింగ్స్‌ని ఓడించాడ‌ని గుర్తు చేసారు. ఈ ప‌రిణామాలు చూస్తుంటే ఈ ఏడాది టైటిల్ బెంగ‌ళూరుకే ద‌క్కేలా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *