Donald Trump Melania: విడిపోయారు

Donald Trump Melanie: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న స‌తీమ‌ణి మెల‌నీ ట్రంప్‌తో విడిపోయార‌ట‌. ఈ విష‌యాన్ని ట్రంప్ వ్య‌క్తిగ‌త బ‌యోగ్రాఫ‌ర్ మైఖెల్ ఊల్ఫ్ ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్ల‌డించారు. ట్రంప్‌కి సంబంధించి ఎన్నో పుస్త‌కాల‌ను అధికారికంగా ప్ర‌చురించిన మైఖెల్.. ట్రంప్ అధ్య‌క్షుడ‌య్యాక మెల‌నీ వైట్ హౌస్‌లో ఉండ‌టం లేద‌ని తెలిపారు. ప్ర‌మాణ స్వీకారం త‌ర్వాత ఏదో మాట‌వ‌ర‌స‌కి కేవ‌లం మూడు సార్లు మీడియా ముందుకు వ‌చ్చిన మెల‌నీ ప్ర‌స్తుతానికి ట్రంప్ నుంచి విడిపోయి వేరుగా నివ‌సిస్తున్నార‌ని వెల్ల‌డించారు. వారిద్ద‌రూ విడిపోయార‌ని కానీ బ‌య‌టికి మాత్రం ఈ విష‌యాన్ని చెప్ప‌డం లేద‌ని అన్నారు. అయితే మైఖెల్ వ్యాఖ్య‌ల‌పై వైట్ హౌస్ స్పందిస్తూ… మైఖెల్ బ‌యోగ్రాఫ‌ర్‌గా పనిచేసిన మాట నిజ‌మే కానీ అత‌నో అబ‌ద్ధాల కోరు అని మండిప‌డింది. ట్రంప్ దంప‌తులు విడిపోలేద‌ని.. అవ‌స‌రం ఉన్నంత‌వ‌ర‌కు మాత్రమే మెల‌నీ బ‌య‌టికి రావాల‌ని అనుకుంటున్నార‌ని వెల్ల‌డించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *