Covid: కోవిడ్ మహమ్మారి ముగిసిపోయింది అనుకుంటున్న క్రమంలో మళ్లీ విజృంభిస్తోందన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి.
హాంకాంగ్, సింగపూర్‌లో మళ్లీ కొవిడ్ భయం నెలకొంది. కొవిడ్‌తో పాటు అడినోవైరస్, రైనో వైరస్ వ్యాప్తిచెందుతోందట. హాంకాంగ్‌లో 17, 13 నెలల చిన్నారులకు వైరస్ సోకింది. ఈనెల 3న తొలి కేసు నిర్ధారణ కాగా.. వారంలోనే వేలల్లో కేసులు నమోదయ్యాయి. సింగపూర్‌లో వారంలో 14,200కు కేసులు పెరిగాయి. సింగపూర్, హాంకాంగ్‌లో మళ్లీ మాస్క్ తప్పనిసరిగా వాడాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశించాయి. వైరస్ వ్యాప్తి, తాజా పరిస్థితిపై WHO ఆరాతీస్తోంది.