AK Bharti: ఆపరేషన్ సింధూర్ కావచ్చు.. లేదా గతంలో భారత్ చేసిన ఎలాంటి సర్జికల్ స్ట్రైక్స్ అయినా కావచ్చు.. ఈ దాడులు పాకిస్థాన్‌పై చేసినవి కావు. ఆ దేశం పాలు పెంచి పోషిస్తున్న ఉగ్రమూకలను మట్టుబెట్టేందుకు చేసిన దాడులు అని ఇప్పటికే భారత్ కొన్ని లక్ష సార్లు చెప్పి ఉంటుంది. ఇటీవల భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ కూడా ఉగ్రవాదులను నిర్మూలించేందుకు చేసిన దాడే. కానీ పాపం పాకిస్థాన్ మధ్యలో దూరింది అంటూ భారత ఎయిర్ మార్షల్ ఏకే భారతి చమత్కరించారు. భారత్ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు మెరుపు దాడులు చేస్తుంటే పాకిస్థాన్ అడ్డుపడటం విచారించాల్సిన విషయమని అన్నారు. ఉగ్రవాదులను కాపాడేందుకు పాక్ మిలిటరీ అడ్డుపడుతుండడంతో భారత్ యాక్షన్ తీసుకోక తప్పలేదని మరోసారి స్పష్టం చేసారు.