Cucumber: తినండి.. కానీ రాత్రి కాదు

Cucumber: కొన్ని ర‌కాల కూర‌గాయ‌లు, పండ్లు ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. తిన‌కూడ‌ని స‌మ‌యాల్లో తింటే బెడిసికొడ‌తాయి. అలాంటి కూర‌గాయ‌ల్లో కీరాదోస ఒక‌టి. కీరాలో 95% నీటి శాత‌మే ఉంటుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఇందులో కేలొరీలు త‌క్కువ పీచు శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వేస‌వి కావ‌డంతో రాత్రి వేళ‌ల్లో ఆక‌లి ఎక్కువ వేయ‌దు. దాంతో క‌డుపు చ‌ల్ల‌గా ఉంటుంద‌ని కీరా దోస ముక్క‌లు తినేసి ప‌డుకుంటూ ఉంటారు.

అలా వ‌ద్దు. తినండి.. కానీ రాత్రి వేళ‌ల్లో మాత్రం వ‌ద్దు. ఎందుకంటే రాత్రి వేళ‌ల్లో మ‌న శ‌రీరంలో మెట‌బాలిజం నెమ్మ‌దిస్తుంది. ఆ స‌మ‌యంలో పీచు శాతం ఎక్కువ‌గా ఉండే ఏ ఆహారం తీసుకున్నా జీర్ణం అవ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. దాంతో నిద్ర‌ప‌ట్ట‌దు.  ఇలా తిన‌డం అల‌వాటు ఉన్న‌వారికి గ్యాస్, బ్లోటింగ్, జీర్ణ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌. కీరాలో కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ‌. కాబ‌ట్టి ఇది రాత్రిళ్లు తింటే జ‌లుబు చేసే అవ‌కాశం లేక‌పోలేదు. మ‌రెప్పుడు తినాలి అంటారా? మీరు లంచ్ చేయ‌డానికి 10 నిమిషాల ముందు కీరా ముక్క‌లు తీసుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ఎక్కువ అన్నం తినేయ‌కుండా ఉంటారు. క‌డుపు నిండుగా ఉంటుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి ఇది మంచి రొటీన్‌గా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *