Kantara 2: వ‌రుస‌గా మూడో ప్ర‌మాదం.. న‌టుడు మృతి

Kantara 2: 2022లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ అందుకున్న ప్ర‌ముఖ క‌న్న‌డ చిత్రం కాంతార. రిష‌భ్ శెట్టి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా ముందు చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఆ త‌ర్వాత అంత‌ర్జాతీయ గుర్తింపును ద‌క్కించుకుంది. దాంతో కాంతార చాప్ట‌ర్ 2 అంటూ ప్రీక్వెల్ తీయాల‌ని రిష‌భ్ నిర్ణ‌యించుకున్నారు. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.

అయితే.. ఈ సినిమా షూటింగ్ మొద‌లుపెట్టిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మూడు ప్ర‌మాదాలు చోటుచేసుకున్నాయి. తాజా ఘ‌ట‌న‌లో ఈ సినిమాలో కీలక పాత్ర‌లో న‌టించిన రాకేష్ పూజారి అనే న‌టుడు షూటింగ్ అయిపోయిన మ‌రుస‌టి రోజే గుండెపోటుతో చ‌నిపోయారు. మే 11న షూటింగ్‌లో పాల్గొన్న రాకేష్‌.. ఈరోజు ఓ మెహందీ ఫంక్ష‌న్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్ప‌కూలిపోయాడు. వెంట‌నే ఆయ‌న్ను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించగా అప్ప‌టికే చ‌నిపోయిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు.

కొన్ని నెల‌ల క్రితం ఫిలిం ప్రొడ‌క్ష‌న్ సభ్యుల బ‌స్సు క‌ర్ణాట‌క‌లోని కొల్లూరు ప్రాంతంలో ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మే 6న క‌పిల్ అనే జూనియర్ ఆర్టిస్ట్ కొల్లూరు స‌మీపంలో ఉన్న సౌప‌ర్ణిక నదిలో ఈత‌కు వెళ్లి మునిగి చ‌నిపోయాడు. దాంతో కాంతార చిత్ర‌బృందం ఆవేద‌న చెందుతోంది. ప్ర‌స్తుతానికి రాకేష్ పూజారికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తైపోయింద‌ని.. కానీ ఆయ‌న త‌న సినిమాను తాను చూసుకోకుండానే ఇలా చ‌నిపోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అని చిత్ర‌బృందం సంతాపం ప్ర‌క‌టించింది. Kantara 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *