Pakistan: అప్పు వ‌ద్దు సాయం వ‌ద్దు.. అదంతా ఉత్తుత్తే

Pakistan: ఎన్ని నంగ‌నాచి వేషాలు వేస్తోందో పాక్‌. ప‌హల్గాం దాడి నేప‌థ్యంలో కేవ‌లం ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టాల‌న్న ఉద్దేశంతోనే భార‌త్ ఆప‌రేషన్ సింధూర్‌ను చేప‌ట్టింది అని ఎన్నిసార్లు చెప్పినా పాక్ చెవిలో శంఖం ఊదిన‌ట్లుగానే ఉంది. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోకుండా కావాల‌ని యుద్ధానికి కాలు దువ్వుతోంది. వ‌ద్దు అని చెప్తున్నా స‌రిహ‌ద్దుల్లో దాడుల‌కు పాల్ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ విదేశాంగ్ శాఖ అధికారిక ట్విట‌ర్ నుంచి ఓ ట్వీట్ వ‌చ్చింది. “” మాకు అంత‌ర్జాతీయ భాగ‌స్వామ్యుల నుంచి సాయం కావాలి. వీలైనంత త్వ‌ర‌గా మాకు అప్పు ఇవ్వండి. యుద్ధ వాతావ‌ర‌ణం ఉన్న నేప‌థ్యంలో మా స్టాక్ మార్కెట్ ప‌డిపోయింది. కాబ‌ట్టి ఇరు దేశాల మ‌ధ్య శాంతి భ‌ద్ర‌త‌లు నెల‌కొనేలా ఇత‌ర‌ దేశాలు క‌ల‌గ‌జేసుకోవాలి “” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కాసేప‌టికే తెగ వైర‌ల్ అయ్యింది. దాంతో ఇప్పుడు పాక్ విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అస‌లు ఆ ట్వీట్ తాము చేయ‌లేద‌ట‌. త‌మ అధికారిక ట్విట‌ర్ హ్యాక్ అయ్యింద‌ట అందుకే ఆ ఖాతాను తొల‌గించాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలిపింది. అంటే త‌మ‌కు అప్పు, సాయం వ‌ద్దు అని పాక్ చెప్తున్న‌ట్లే క‌దా..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *