Sobhita Dhulipala: నాగచైతన్య, శోభిత ధూళిపాల దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారని కొంతకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. మంచి రోజు చూసుకుని వారే ప్రకటిస్తారని అన్నారు. దీనిపై శోభిత స్పందించారు. ఇది దాస్తే దాగే వార్త కాదని.. పిల్లలు కనేందుకు ఇంకా టైం ఉందని అన్నారు. ప్రస్తుతానికి తాను నాగచైతన్యతో వైవాహిక బంధాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. కొన్ని నెలల క్రితమే శోభిత, నాగచైతన్యల వివాహం ఘనంగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన సంగతి తెలిసిందే.