Baba Ramdev: దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్‌తో నాలుగు రోజుల పాటు యుద్ధం చేసే సత్తా కూడా లేదని అన్నారు యోగా గురువు బాబా రాందేవ్. పాకిస్థాన్‌కి ఆ దేశ ప్రజలే ఫుల్ స్టాప్ పెట్టేస్తారని.. వారితో యుద్ధం చేసి కూడా వృథానే అని మండిపడ్డారు. ఈ యుద్ధం జరిగే లోపే పాకిస్థాన్‌లోని కరాచీ, లాహోర్‌లో గురుకులాలు నిర్మించాలని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. “” పాకిస్థాన్‌ని ఎవ్వరూ మట్టుబెట్టాల్సిన అవసరం లేదు. ఆ దేశ ప్రజల చేతిలో అదే చచ్చిపోతుంది. ఇప్పటికే బెలూచిస్థాన్‌లోని పంఖ్తూన్ ప్రజలు తమకు స్వాతంత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. పాక్‌కి భారత్‌తో పోరాడేంత సీన్ లేదు. నాలుగు రోజులు కూడా యుద్ధాన్ని తట్టుకోలేదు. కాబట్టి మనమే అక్కడ గురుకులాలు నిర్మించేంత బలహీనంగా పాక్ పరిస్థితి ఉంది “” అన్నారు.