Search The Query
Search

Image
  • Home
  • News
  • శ‌ని భ‌గ‌వానుడి కాలు నరికింది ఎవ‌రు?

శ‌ని భ‌గ‌వానుడి కాలు నరికింది ఎవ‌రు?

0Shares

Shani Dev  మీరెప్పుడైనా గ‌మ‌నించారా? శ‌ని భ‌గ‌వానుడిని ఫోటోల్లో విగ్ర‌హాల్లో చూసిన‌ప్పుడు ఒక కాలే కనిపిస్తుంటుంది. చాలా మంది ఆయ‌న కాలు మ‌డిచి కూర్చోవ‌డం వ‌ల్ల ఒకే కాలు క‌నిపిస్తుంద‌ని అనుకుంటారు కానీ నిజానికి శ‌ని దేవుడికి ఉన్న‌ది ఒక‌టే కాలు. దీని వెనుక చాలా క‌థ‌లు ఉన్న‌ప్ప‌టికీ సాధార‌ణంగా చెప్పుకునే ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం ఒక‌టి ఉంది. అదేంటో తెలుసుకుందాం.

మేఘ‌నాథుడు పుట్ట‌డానికి ముందు అత‌న్ని ఏ శ‌క్తీ అడ్డుకోలేనంత వాడిని చేయాల‌ని అనుకుంటాడు తండ్రి రావ‌ణాసురుడు. ఇందుకోసం మేఘ‌నాథుడు జ‌న్మించ‌క‌ముందే పెద్ద పెద్ద జ్యోతిష్య‌ స‌మ‌వుజ్జీల‌ను పిలిపించి అన్ని గ్ర‌హాలు త‌మ స్థానాల్లో మేఘ‌నాథుడికి అనుకూలంగా ఉండేలా ఆదేశిస్తాడు. ఈ గ్ర‌హాల్లో శ‌ని భ‌గ‌వానుడు కూడా ఉంటాడు.

రావ‌ణాసురుడు చేస్తున్నది త‌ప్పు అని భావించిన నార‌దుడు వెంట‌నే ఈ విష‌యాన్ని విష్ణుమూర్తి చెవిన వేస్తాడు. రావ‌ణాసురుడి ప్లాన్ దెబ్బ తీయాల‌ని భావించిన విష్ణు వెంట‌నే శ‌ని భ‌గ‌వానుడి వ‌ద్ద‌కు వెళ్లి.. నువ్వు నీ స్థానంలోనే ఉండు కానీ మేఘ‌నాథుడు పుట్టే స‌మ‌యానికి నీ కాలు తీసి ప‌క్క స్థానంలో పెట్టు అని ఐడియా ఇస్తాడు.

ఆయ‌న మాట‌ను జ‌వ‌దాట‌ని శ‌ని మేఘ‌నాథుడు పుట్టే స‌మ‌యానికి కాలు తీసి ప‌క్క స్థానంలో పెడ‌తాడు. అది చూసిన రావ‌ణాసురుడు శ‌ని కాలు న‌రికేస్తాడు. కానీ అప్ప‌టికే ప‌క్క స్థానంలో శ‌ని కాలు పెట్టేయ‌డంతో మేఘ‌నాథుడు అత్యంత శ‌క్తిమంతుడు అవుతాడు కానీ చిరంజీవుడు మాత్రం కాలేక‌పోయాడు.

శ‌ని కాకినే త‌న వాహ‌నంగా ఎందుకు ఎంచుకున్నాడు?

శ‌ని భ‌గ‌వానుడి వాహ‌నం కాకి అన్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఇన్ని పక్షులు, జంతువులు ఉండ‌గా ఆయ‌న కాకినే ఎంచుకోవ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి. అవేంటంటే…. కాకికి జ్ఞాప‌క‌శ‌క్తి ఎక్కువ‌. ఎవ్వ‌రినీ మర్చిపోదు. పైగా ఒకే చోట అలాగే వాలి గ‌మ‌నించ‌డం దాని ప్ర‌త్యేక‌త‌. అంతేకాదు.. ఒకే ప్ర‌దేశానికి మాటిమాటికీ వ‌స్తుంటుంది. శ‌ని క‌ర్మ‌కార‌కుడు కాబ‌ట్టి.. కాకి మాదిరిగానే క‌ర్మ అనేది కూడా దాని ఫ‌లితాన్ని అదివ్వ‌డం మ‌ర్చిపోదు.

శ‌ని దేవుడు అష్ట‌కష్టాలు పెడుతుంటాడ‌ని చాలా మంది తిట్టుకుంటూ ఉంటారు. మీరు గ‌మ‌నించిన‌ట్లైతే కాకి ప‌డేసిన అన్నం ముద్ద‌లు, వ‌దిలేసిన ఆహారంపై మాత్ర‌మే ఆధార‌ప‌డుతుంది. అంటే.. అణిగిమ‌ణిగి ఉండాలి అని దాని అర్థం. అందుకే శ‌ని దేవుడు కర్మానుసారం క‌ష్టాలు ఇచ్చి దాని నుంచి ఎలా పైకి లేవాలి అనే గుణ‌పాఠాన్ని నేర్పుతాడు.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • banglawin88vip says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    Being a regular player from the south asian region I can say this site understands exactly what we need. Fast withdrawals and a huge collection of local games make my downtime so much better. The interface feels super intuitive even for newcomers. I highly recommend visiting banglawin88vip to feel the difference yourself.
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top