ATM: ప్రతీ దేశంలో బ్యాంకులు ఉంటాయి. వాటికి సంబంధించిన ATMలూ ఉంటాయి. కానీ అసలు ఒక్క ATM లేని దేశం ఉందంటే నమ్ముతారా? ATM ఏంటి.. అసలు ఆ దేశంలో ఉన్నది కూడా ఒక్కటే బ్యాంకు. ఇంతకీ అదే దేశమో.. దాని వివరాలేంటో తెలుసుకుందాం.
ఇంతకీ ఆ దేశం ఏదంటే.. తువాలు. దక్షిణ పెసిఫిక్ మహాసముద్రానికి దగ్గర్లో ఉంది ఈ దేశం. ఈ దేశంలో మొత్తం 9 చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇక్కడ నివసించేది కేవలం 12 వేల మందే. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశాల్లో ఇదొకటి. తువాలు దేశంలో ఉన్న ఏకైక బ్యాంక్ పేరు నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలు.
1980లో బార్‌క్లేస్ బ్యాంక్‌కు ఉప బ్యాంక్‌గా దీనిని ప్రారంభించారు. ఈ దేశంలో మరే ఇతర ఏటీఎం కార్డులు పని చేయవు. అసలు తువాలులో ఏటీఎంలు కూడా ఉండవు. ఇక్కడ నివసించే వారంతా క్యాష్ ద్వారానే లావాదేవీలు చేస్తారు. ఈ దేశ కరెన్సీని ఆస్ట్రేలియన్ డాలర్ అంటారు. ఎందుకంటే ఇది ఆస్ట్రేలియాకు నైరుతిలో ఉంది.
కరెన్సీని కూడా తువాలునే ప్రింట్ చేసుకుంటుంది. తువాలుకి వచ్చే ఆర్థిక వనరులన్నీ .tv అనే ఇంటర్నెట్ డొమైన్ నుంచి వస్తాయి. ఈ .tv మీడియా, టీవీ ఛానెల్స్‌లలో చాలా పాపులర్. చాలా దేశాలు దీనిని వాడుతుంటాయి. ఈ .tv నుంచే తువాలుకు ఏడాదికి 10 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది.