Chiranjeevi: మా బిడ్డ మార్క్ శంక‌ర్ వ‌చ్చేసాడు

Chiranjeevi: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డిప్యూటీ సీఎం చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ ప్ర‌స్తుతానికి డిశ్చార్జి అయ్యి ఇంటికి వ‌చ్చాడ‌ని తెలిపారు చిరంజీవి. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డిస్తూ.. త‌న త‌మ్ముడు ప‌వ‌న్‌తో క‌లిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు.అయితే ఇంకా కోలుకోవాలి.మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.

ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని చిరు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *